Reading Time: < 1 minute

IPL 2026: వర్షం దెబ్బకి ఆగిన కేకేఆర్ vs పంజాబ్ మ్యాచ్.. 16 రన్స్కే 2 వికెట్లు కోల్పోయిన కోల్‌కతా

Caption of Image.

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న కీలక పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకుంది. దీంతో క్రీజులోకి వచ్చిన కేకేఆర్ ఓపెనర్లు ఫస్ట్ ఓవర్లోనే దూకుడుగా బ్యాటింగ్ చేసి ఏకంగా 12 పరుగులు రాబట్టారు. కానీ ఆ తర్వాత బౌలింగ్ కి వచ్చిన జేవియర్ బార్ట్‌లెట్ కేకేఆర్ కి బిగ్ షాక్ ఇచ్చాడు. ఒకే ఓవర్లో కీలకమైన ఇద్దరు స్టార్ బ్యాటర్లని ఔట్ చేశాడు.

ఇక పంజాబ్ బౌలర్ జేవియర్ బౌలింగ్(1.4)  వేసిన అద్భుతమైన బంతికి కేకేఆర్ హార్డ్ హిట్టర్ ఫిన్ అలెన్ (6) వికెట్ కీపర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ కి క్యాచ్ ఇచ్చి స్టేడియం వదిలి పెట్టి వెళ్లిపోయాడు. అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన స్టార్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్ (4) వచ్చి రాగానే ఓ ఫోర్ కొట్టిన తర్వాత బంతికే జేవియర్ బౌలింగ్(1.6)లోనే పంజాబ్ వికెట్ కీపర్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరుకోవడంతో.. 16 పరుగులకే కీలకమైన రెండు వికెట్లు నష్టాల్లో పడింది. 

అనంతరం క్రీజులోకి వచ్చిన రఘువంశీ(2)తో కలిసి కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో వరుణుడు మ్యాచ్ జరగకుండా అడ్డుకున్నాడు. ఈ మ్యాచ్ కేవలం 3.4 ఓవర్లు మాత్రమే సాగిన తర్వాత వర్షం కురవడంతో అంపైర్లు మ్యాచ్ ని ఆపేయడంతో ఆటగాళ్లు డ్రెస్సింగ్ కి వెళ్లిపోయారు. ప్రస్తుతం 2 వికెట్ల నష్టానికి 25 పరుగులు చేసిన కేకేఆర్.. క్రీజులో రహానే (8), రఘువంశీ (2) ఉన్నారు. 

©️ VIL Media Pvt Ltd.