Reading Time: < 1 minute
Naga Shaurya Comments On Sridevi Vijaykumar At Bad Boy Karthik Trailer Launch

నాగ శౌర్య తన కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా ఒక ఫుల్ లెంగ్త్ మాస్ రోల్‌లో కనిపిస్తున్న చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత నాగ శౌర్య వెండితెరపైకి రాబోతున్నారు. రమేష్ దేసేన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రూరల్ యాక్షన్ డ్రామాలో విధి యాదవ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సముద్రఖని విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతం అందించడం మరో విశేషం. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. కాగా ట్రైలర్‌లో నాగ శౌర్య ఊర మాస్ గెటప్, పవర్‌ఫుల్ డైలాగ్స్ చూస్తుంటే ఆయన బాక్సాఫీస్ వద్ద గట్టి కమ్‌బ్యాక్ ఇవ్వబోతున్నట్లు అర్థమవుతోంది.

Also Read : The Paradise: ‘ది ప్యారడైజ్’ రిలీజ్ విషయంలో నాని లెక్క మళ్ళి తప్పుతుందా?

ఈ సినిమా ఏప్రిల్ 17, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, సాయి కుమార్ వంటి భారీ తారాగణం ఉన్న ఈ చిత్రంపై ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. అయితే ఈ ఈవెంట్‌లో పాల్గొన్న నాగ శౌర్య, ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న నటి శ్రీదేవి విజయ్ కుమార్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను చిన్నప్పుడు ప్రభాస్ నటించిన ‘ఈశ్వర్’ సినిమా చూసినప్పటి నుండే శ్రీదేవి పెద్ద అభిమానినని, ఆమె ఈ సినిమాలో నటించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. అంతే కాదు శ్రీదేవి ఈ చిత్రానికి ఒక ‘లక్కీ చార్మ్’ లాంటి వారని, ఆమె ఉంటే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం తనకు ఉందని ఆయన ఎమోషనల్ గా మాట్లాడారు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.