Reading Time: < 1 minute
Actress Trisha Retirement Rumors Vijay Tvk Party Vishwambhara Updates

సౌత్ ఇండియన్ క్వీన్ త్రిష తన సినీ ప్రయాణానికి ముగింపు పలకబోతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది కోలీవుడ్ వర్గాల్లో. గత కొంతకాలంగా దళపతి విజయ్‌తో ఆమెకున్న సాన్నిహిత్యం, రాజకీయ పరిణామాల నేపథ్యంలో త్రిష నటనకు స్వస్తి చెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె కొత్తగా ఏ ప్రాజెక్టులకు సంతకం చేయకపోవడం, చేతిలో ఉన్న సినిమాలను చకచకా పూర్తి చేస్తుండటం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. ముఖ్యంగా విజయ్ స్థాపించిన TVK పార్టీలో ఆమె కీలక పాత్ర పోషించబోతున్నారని, అందుకే వెండితెరకు దూరమై రాజకీయ అరంగేట్రం చేయనున్నారని తమిళ మీడియా కోడై కూస్తోంది.

Also Read : Vijay,Rashmika: అందుకే రష్మికను పెళ్లి చేసుకున్నా.. విజయ్ దేవరకొండ క్రేజీ కామెంట్స్!

ప్రస్తుతం త్రిష నటించిన రెండు భారీ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సూర్య – ఆర్‌జే బాలాజీ కాంబినేషన్‌లో వస్తున్న ‘కరుప్పు’ (Karuppu) మే 14న థియేటర్లలోకి రాబోతుండగా, మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన ‘విశ్వంభర’ (Vishwambhara) జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాల ప్రమోషన్ల తర్వాత త్రిష తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో, విజయ్ గెలుపు కోసం త్రిష స్టార్ క్యాంపెయినర్‌గా మారబోతున్నారనే వార్తలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే, ‘విశ్వంభర’ త్రిష కెరీర్‌లో చివరి తెలుగు చిత్రం అయ్యే అవకాశం ఉంది.