Reading Time: < 1 minute

హైదరాబాద్ బండ్లగూడ జాగిర్ లో అగ్ని ప్రమాదం.. తగలబడ్డ బట్టల షాప్

Caption of Image.

గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం కలకలం సృష్టించింది. బండ్లగూడ జాగిర్ పరిధిలోని ఓ బట్టల షాపులో మంటలు చెలరేగాయి.రెండు అంతస్తుల్లో ఉన్న సిద్ధి వినాయక టెక్స్టైల్స్ షాపులో మంటలు ఒక్కసారిగా అలుముకున్నాయి. మంటలకు తోడు దట్టమైన పొగ రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 100కు డయల్ చేసి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో రెండు ఫ్లోర్లలోని బట్టల షాపు పూర్తిగా దగ్ధమైంది. దీనివల్ల భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

నగరంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగానే షార్ట్ సర్క్యూట్ సంభవించి, ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
 

©️ VIL Media Pvt Ltd.