Reading Time: < 1 minute

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

Caption of Image.

గొల్లపల్లి, వెలుగు : అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలను అందించడమే తమ లక్ష్యమని ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరు జీపీ ఆవరణలో కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గొల్లపల్లి మండలానికి చెందిన 24 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, 107 మందికి సీఎంఆర్ ఎఫ్ చెక్కులను అందజేశారు.  చిల్వకోడూరు గ్రామానికి చెందిన కాసా లక్ష్మీరాజంకు రూ.3 లక్షల ఎల్ఓసి ని అందజేశారు.  అలాగే ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని గృహప్రవేశాలు చేయించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సంతోష్, కాంగ్రెస్‌‌‌‌ మండల అధ్యక్షుడు నిశాంత్ రెడ్డి, సర్పంచ్ తిరుపతి గౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.