Reading Time: 2 minutes

LSG vs RR మధ్య గెలుపు కోసం ఆరాటం.. హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే

Caption of Image.

IPL 2026: ఇండియర్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా (2026, ఏప్రిల్ 22) లక్నోలోని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజపేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో ఒక ఆసక్తికరమైన పోరు జరగనుంది. రిషబ్ పంత్ నాయకత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ (LSG), రియాన్ పరాగ్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ (RR) తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లోకి ఇరు జట్లు తమ గత మ్యాచ్‌ల్లో ఓటములతో అడుగు పెడుతున్నాయి. ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో రాజస్థాన్ ఓడిపోయింది. వరుసగా రెండు ఓటముల తర్వాత మళ్ళీ ఫామ్‌లోకి రావాలని చూస్తుండగా, లక్నో సైతం చండీగఢ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో 54 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ప్రస్తుతం ఆరు మ్యాచ్‌ల్లో కేవలం 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. 

హెడ్-టు-హెడ్ రికార్డులు: 
ఐపీఎల్ లో ఇప్పటి వరకు లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మొత్తం 6 మ్యాచులు జరిగాయి. ఇందులో లక్నో 2 మ్యాచులలో విజయం సాధించగా.. రాజస్థాన్ మాత్రం 4 మ్యాచులలో గెలిచి పైచేయి సాధించింది. 

ఇరు జట్లలో మార్పులు: 
లక్నో సూపర్ జెయింట్స్: స్పీడ్‌స్టర్ మయాంక్ యాదవ్ ఫిట్‌గా ఉన్నాడని ఐడెన్ మార్క్రామ్ ధృవీకరించారు. అయితే అతను తుది జట్టులోకి వస్తాడా లేదా అన్నది చూడాలి.

Also Read : చెన్నైకు దెబ్బ మీద దెబ్బ.. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ నుంచి ఆయుష్‌‌‌‌‌‌‌‌ ఔట్

రాజస్థాన్ రాయల్స్: జట్టులో పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు. అయితే ఫామ్‌లో లేని షిమ్రాన్ హెట్‌మైర్ స్థానంలో ఆల్ రౌండర్ దసున్ షనకను తీసుకునే ఆలోచనలో మేనేజ్మెంట్ ఉంది.

తుది జట్ల అంచనా: 
లక్నో సూపర్ జెయింట్స్: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్ & వికెట్ కీపర్), నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, ముకుల్ చౌదరి, మహమ్మద్ షమీ, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, మణిమారన్ సిద్ధార్థ్, మోహ్సిన్ ఖాన్.

రాజస్థాన్ రాయల్స్: వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్‌మైర్/దసున్ షనక, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, రవి బిష్ణోయ్.
 

©️ VIL Media Pvt Ltd.