
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎలాంటి వార్త వచ్చినా సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అవుతుంది. భారీ కలెక్షన్లు, ప్రెస్టీజియస్ అవార్డులతో దేశవ్యాప్తంగా స్టార్‌డమ్‌ను అందుకున్న ఆయన, ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో తన మార్క్‌ను చూపించే దిశగా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన తాజా అప్‌డేట్ కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
బన్నీ కలల భవనం
అల్లు అర్జున్, హైదరాబాద్‌లోని ప్రీమియం ప్రాంతమైన జూబ్లీ హిల్స్‌లో, మెగాస్టార్ చిరంజీవి నివాసానికి సమీపంలో ఒక విలాసవంతమైన భవనాన్ని నిర్మిస్తున్నారని సమాచారం. సుమారు 4,000 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ మెన్షన్, ఆధునిక వాస్తుశిల్పం మరియు అంతర్జాతీయ డిజైన్ అంశాలతో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్మాణ వ్యయం దాదాపు రూ.80 కోట్ల వరకు ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఆధునిక డిజైన్ – లగ్జరీ ఫీచర్లు
ఈ భవనంలో ప్రైవేట్ థియేటర్, స్విమ్మింగ్ పూల్, జిమ్, విశాలమైన గార్డెన్ ఏరియా వంటి విలాసవంతమైన సౌకర్యాలు ఉండనున్నాయి. అదనంగా, అత్యాధునిక భద్రతా వ్యవస్థలు, సహజ కాంతి మరియు పచ్చదనాన్ని ప్రాధాన్యం ఇచ్చే ఇంటీరియర్ డిజైన్‌తో ఈ ఇల్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కుటుంబానికి సౌకర్యవంతమైన మరియు ఆధునిక జీవనశైలిని అందించేలా ప్రతి అంశాన్ని ప్లాన్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం బన్నీ కలల సౌధం నిర్మాణం చివరి దశలో ఉండగా, ఈ ఏడాది చివర్లో అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి గృహప్రవేశం చేయనున్నారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ముంబైకి షిప్ట్ !
ప్రస్తుతం రాకా మూవీ కోసం ముంబైకి మకాం మార్చాలని అల్లు అర్జున్ నిర్ణయించుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. పదే పదే హైదరాబాద్ టు ముంబైకి ప్రయాణించడం వల్ల సమయం వృదా అవుతుంది. అంతే కాకుండా సినిమాపైనే పూర్తి దృష్టి పెట్టడానికి బన్నీ ముంబైకి షిప్ట్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఈ చిత్రంలో అల్లు అర్జున్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారని టాక్. వాటిల్లో పోలీస్ ఆఫీసర్, సగం మానవ-సగం రాక్షస రూపం, తండ్రి పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం.
Also Read : హిస్టారికల్ థ్రిల్లర్‌లో రానా-అక్షయ్
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘రాక’, 2026 చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాను ఊపేస్తోంది. ‘పుష్ప’తో పాన్ ఇండియా రేంజ్ సాధించిన బన్నీ, ‘రాక’తో గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. భారీ బడ్జెట్, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ, స్టార్ తారాగణం కలిసిన ఈ ‘రాక’ బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో వేచి చూడాలి..
The wait is over.
Gear up for #RAAKA ! pic.twitter.com/yzuovTCEpe— Allu Arjun (@alluarjun) April 8, 2026