Reading Time: < 1 minute

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టారు !

Caption of Image.

మెట్పల్లి: జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ఒక మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఇద్దరు ఆడ పిల్లలు, ఒక మగ పిల్లాడు పుట్టారు. మెట్పల్లి టౌన్లోని ప్రైవేట్ హాస్పిటల్లో ఈ ప్రసవం జరిగింది. నరేందర్, రాజ్యలక్ష్మి దంపతులకు తొలి సంతానంలోనే ఇలా ముగ్గురు పిల్లలు పుట్టడం విశేషం. ఈ దంపతులు పట్టణంలోని రాజేశ్వర్‌ రావు పేటకు చెందిన వారు కావడం గమనార్హం. తల్లీపిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జులైలో ఒక మహిళ ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. పెద్ద కొత్తపల్లి మండలం నారాయణ పల్లి గ్రామానికి చెందిన అనిత మొదటి కాన్పు కోసం ఆస్పత్రికి వెళ్లింది. ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడికి జన్మనిచ్చింది. ముగ్గురు పిల్లల బరువు రెండు కిలోల చొప్పున ఉన్నారని, ముగ్గురూ ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్​ తెలిపారు. సాధారణ కాన్పులో ముగ్గురు జన్మించడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

©️ VIL Media Pvt Ltd.