Reading Time: < 1 minute

నిజామాబాద్‌‌‌‌: మెగా జాబ్‌‌‌‌‌‌‌‌ మేళాకు విశేష స్పందన..తరలివచ్చిన 2500 మంది నిరుద్యోగులు

Caption of Image.

నిజామాబాద్‌‌‌‌, వెలుగు: నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ అర్బన్‌‌‌‌ ‌‌‌‌ఎమ్మెల్యే ధన్‌‌‌‌‌‌‌‌పాల్‌‌‌‌ ‌‌‌‌సూర్యానారాయణ ఆధ్వర్యంలో పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన మెగాజాబ్‌‌‌‌ ‌‌‌‌మేళాకు విశేష స్పందన వచ్చింది. శ్రీరామ గార్డెన్స్‌‌‌‌లో ఏర్పాటుచేసిన జాబ్ మేళాకు దాదాపు 2500 నిరుద్యోగులు తరలిరాగా.. 70కి పైగా కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. సుమారు 800 మందికి కంపెనీల ప్రతినిధులు ఆఫర్​ లెటర్స్‌‌‌‌‌‌‌‌ అందజేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్‌‌‌‌‌‌‌‌పాల్‌‌‌‌ ‌‌‌‌మాట్లాడుతూ.. ప్రతిభగల యువతకు కొలువులు ఇప్పించడానికి మేళా నిర్వహించానన్నారు. యూత్‌‌‌‌‌‌‌‌కు ఉద్యోగవకాశాలే తన లక్ష్యమని, ఐటీ హబ్‌‌‌‌‌‌‌‌ను ఆ దిశగా డెవలప్‌‌‌‌ ‌‌‌‌చేస్తానన్నారు. సీపీ సాయిచైతన్య, మేయర్‌‌‌‌‌‌‌‌ ఉమారాణి, కార్పొరేటర్లు నాగోళ్ల లక్ష్మీనారాయణ, బెల్లాల్‌‌‌‌ ‌‌‌‌శశాంక్‌‌‌‌‌‌‌‌, మఠం పవన్‌‌‌‌‌‌‌‌, శ్రావణ్‌‌‌‌‌‌‌‌, రాము తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.