Reading Time: 2 minutes

బూజు పట్టి చికెన్.. మడ్డిగా మారిన ఆయిల్లో డీప్ ఫ్రై: బెంగళూరులో బయట ఫుడ్ ఎలా తింటున్నార్రా సామీ !

Caption of Image.

బెంగళూరు: బెంగళూరు సిటీలో పేరు మోసిన 5 స్టార్ హోటల్స్, రెస్టారెంట్లు కస్టమర్ల ఆరోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేశాయి. ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. బూజు పట్టిన చికెన్, మళ్లీ మళ్లీ వాడి మడ్డిగా అయిన ఆయిల్ను మళ్లీ ఫ్రైలకు వాడటం.. ఇలా చాలా దారుణమైన విషయాలు బయటపడ్డాయి. ఆదివారం కూడా కర్ణాటక హెల్త్ డిపార్ట్మెంట్ ఫుడ్ సేఫ్టీ సోదాలు జరిపింది.

హోటల్ స్క్రై (యూబీ సిటీ), రాయల్ చైన్ హోటల్, మద్రాస్ కిచెన్, టెస్కాన్ హోటల్, షెంచెజ్ హోటల్లో సోదాలు చేసింది. UB సిటీలోని ‘స్కై లాంజ్’ (Skyee Lounge) హోటల్లో అయితే నిల్వ చేసిన మాంసం, బీఫ్ బూజు పట్టి ఫంగస్ చేరడంతో షాకైన అధికారులు హోటల్ను సీజ్ చేశారు. పది రోజుల క్రితం ఎక్సైరీ డేట్ అయిపోయిన పాలు, పెరుగు హోటల్లో కనిపించాయి. ఇక.. వంట నూనె అయితే మెకానిక్ షెడ్డులో మనం చూసే మడ్డి ఆయిల్ కంటే ఘోరంగా ఉంది.

1. హోటల్ స్కై, UB సిటీ:
* పాడైపోయిన చికెన్/బీఫ్ – 45 కిలోలు
* వెజిటబుల్ కట్లెట్ – 6 కిలోలు
* వాడిన వంట నూనె – 15 లీటర్లు
* మొత్తం ఆహార పదార్థాలు: 51 కిలోలు

ALSO READ : హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నా మారట్లే..

2. రాయల్ చైన్ హోటల్
* బాతు మాంసం (Duck) – 50 కిలోలు
* చేపలు – 5 కిలోలు
* మొత్తం స్వాధీనం: 55 కిలోలు

3. మద్రాస్ కిచెన్
* పచ్చి బఠానీలు – 5 కిలోలు

4. టెస్కాన్ హోటల్
* పుట్టగొడుగులు (Mushroom) – 5 కిలోలు

5. సంచెజ్ హోటల్
* చేపలు – 3 కిలోలు – స్వాధీనం
* కేక్, బంగాళాదుంపలు & టాకోస్ – 7 కిలోలు (పారవేశారు)

  • స్వాధీనం చేసుకున్న/పారవేసిన మొత్తం ఆహార పదార్థాలు: 132 కిలోలు
  • వాడిన వంట నూనె: 15 లీటర్లు
  • ఆహార పదార్థాల మొత్తం పరిమాణం: 132 కిలోలు

UB సిటీలోని ‘స్కై లాంజ్’ (Skyee Lounge) హోటల్ వంటగది అపరిశుభ్రంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా.. మాంసం, బీఫ్ అన్నీ బూజు పట్టి పాడైపోయి ఉన్నాయి. దీంతో.. అధికారులు హోటల్ కిచెన్ను సీజ్ చేశారు.

©️ VIL Media Pvt Ltd.