Reading Time: 2 minutes

అడవిని కాపాడుకుంటూనే గిరిజనులు అభివృద్ధి చెందాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Caption of Image.
  •     గిరిజన బిడ్డలకు ప్రపంచస్థాయి అవకాశాలే లక్ష్యం
  •     ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: అడవితో అనుబంధాన్ని, తమ మూలాలను కాపాడుకుంటూనే గిరిజన సమాజం అభివృద్ధిలో అగ్రస్థానానికి చేరుకోవాలని ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆకాంక్షించారు. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం, విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధితో పాటు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గిరిజన బిడ్డలకు ప్రపంచస్థాయి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని చెప్పారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివారం బంజారా భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.18,745.16 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. విద్య, రహదారులు, తాగునీరు, విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సాగునీరు, భూముల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధికి ఈ నిధులను వినియోగిస్తున్నామన్నారు. 

ఇందిరా గిరి జల వికాసం ద్వారా గిరిజన రైతుల భూములకు నీటి వసతి కల్పిస్తున్నామని చెప్పారు. అభివృద్ధి అంటే నగరాల్లో పెద్ద భవనాలు నిర్మించడం మాత్రమే కాదని, మారుమూల తండాలో ఒక కుటుంబం జీవితాన్ని సులభతరం చేయడమే నిజమైన అభివృద్ధి అని పేర్కొన్నారు. గిరిజన గురుకులాల పరిధిలోని 166 విద్యాసంస్థల్లో 83 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. 2025–26లో పదో తరగతిలో 98 శాతానికి పైగా, ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 86 శాతానికి పైగా, డిగ్రీలో 89 శాతానికి పైగా ఉత్తీర్ణత నమోదైందన్నారు. 28 మంది ఐఐటీల్లో, 23 మంది ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐటీల్లో ప్రవేశాలు పొందగా, 167 మంది నీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అర్హత సాధించారని చెప్పారు. పీఎం-జన్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమలులో తెలంగాణ దేశంలో మూడో ఉత్తమ రాష్ట్రంగా నిలిచిందన్నారు.

రాంజీ గోండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ త్యాగాలు స్ఫూర్తిదాయకం

రాంజీ గోండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి ఆదివాసీ వీరుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాలని మంత్రి అన్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్మిస్తున్న రాంజీ గోండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియం ఇందుకు వేదికగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో మరిన్ని జవహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమం, విద్య, సంస్కృతి, హక్కుల పరిరక్షణలో విశిష్ట సేవలందించిన తొమ్మిది మందితో పాటు ప్రతిభావంతులైన విద్యార్థులను సన్మానించారు.

©️ VIL Media Pvt Ltd.