
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
న్యూఢిల్లీ: ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మన జాతీయ జెండా దేశ ప్రజలందరికీ గర్వకారణమని చెప్పారు. దేశం కోసం మంచి సేవ చేయాలనే స్ఫూర్తిని త్రివర్ణ పతాకం ఇస్తుందని పేర్కొన్నారు. 2022లో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా మొదలైన ‘హర్ ఘర్ తిరంగా’ ఇప్పుడు ఏటా జరిగే జాతీయ కార్యక్రమంగా మారిందన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కోట్లాది మంది ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగరేస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 6న మొదలైన ఈ కార్యక్రమం 17 వరకు దేశవ్యాప్తంగా కొనసాగనుంది.