
బాలీవుడ్ హీరోయిన్ నికితా రావల్ (Nikita Rawal)కు ఓ ఈవెంట్‌లో ఊహించని షాక్ తగిలింది. సెలబ్రిటీల పట్ల అభిమానం ఒక్కోసారి హద్దులు దాటుతుంటుంది అనడానికి ఈ ఘటనే నిదర్శనం. రెడ్ కార్పెట్ పై ఫొటోలకు పోజులిస్తున్న నటి వద్దకు ఓ మహిళా అభిమాని అతి ఉత్సాహంగా వచ్చి బలవంతంగా లిప్ కిస్ ఇచ్చిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే?
ప్రముఖ బాలీవుడ్ నటి నికితా రావల్ ఇటీవల ఒక పబ్లిక్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ క్రమంలో ఈవెంట్ ప్రారంభానికి ముందు ఆమె రెడ్ కార్పెట్ పై నిలబడి మీడియాకు, ఫొటోగ్రాఫర్లకు చిరునవ్వుతో పోజులిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఓ లేడీ ఫ్యాన్ సెల్ఫీ తీసుకోవాలనే పేరుతో హడావుడిగా స్టేజ్ పైకి దూసుకొచ్చింది.
ఇంతలోనే నటి నికితా రావల్.. ఏమాత్రం ఊహించని పరిణామానికి ఒక్కసారిగా కంగుతింది. తొలుత నికితా చెంపపై ముద్దు పెట్టిన ఆ లేడీ ఫ్యాన్, ఆ తర్వాత ఏమాత్రం సంకోచించకుండా ఏకంగా ఆమె పెదవులపై (లిప్ కిస్) బలవంతంగా ముద్దుపెట్టింది. సెల్ఫీ తీసుకునే సాకుతో ఆమె చేసిన ఈ అనూహ్యమైన చర్యతో నికితా రావల్ నివ్వెరపోయారు. అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాక ఆమె కొద్దిసేపు అయోమయానికి గురయ్యారు.
🚨 NIKITA RAWAL SHOCKED BY UNEXPECTED FAN KISS ON CAMERA 🚨
• Bizarre Paparazzi Encounter: Actress Nikita Rawal faced an awkward incident in public while posing for photographers, where a female fan approached her under the guise of taking a selfie.
• Sudden Boundary…
— Missween (@IamMissween) August 9, 2026
వీడియో వైరల్.. నెటిజన్స్ ఫైర్
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ‘ఇది కేవలం అభిమానం కాదు, మరీ అతి!’ అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, ‘సెలబ్రిటీల వ్యక్తిగత భద్రతకు (Personal Space) ఇది భంగం కలిగించడమే’ అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరైతే, అసలు జనాలకు ఏమైంది? ఏం చేస్తున్నారో కూడా స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్నారంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
వింతగా మారుతున్న జనాల వైనం..
కాలం మారుతున్న కొద్దీ జనాల ప్రవర్తనలో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. తమ అభిమానాన్ని చాటుకునే మార్గంలో చాలామంది హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. ఎదుటివారి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా, పబ్లిక్ ప్లేస్‌లో ఇలా ప్రవర్తించడం వల్ల సెలబ్రిటీలు తీవ్రమైన అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ ఘటన మరోసారి సెలబ్రిటీల భద్రత, వారి వ్యక్తిగత గోప్యత అంశాలపై చర్చకు దారితీసింది.
నికితా రావల్ సినిమాలు..
నికితా రావల్ ముంబైకి చెందిన నటి, డాన్సర్, ప్రొడ్యూసర్. బాలీవుడ్‌తో పాటు సౌత్ సినిమాల్లోనూ నటించారు. ‘గరం మసాలా’, ‘బ్లాక్ అండ్ వైట్’, ‘ది హీరో – అభిమన్యు’, ‘మిస్టర్ హాట్ మిస్టర్ కూల్’, ‘అమ్మా కీ బోలి’, ‘క్యూట్ కమీనా’ వంటి చిత్రాల్లో కనిపించారు. తెలుగులో ‘తింపా’ సినిమాలో ఇచ్ఛాధారి నాగిని పాత్రలో నటించారు. ప్రస్తుతం ‘రోటి కప్డా ఔర్ రొమాన్స్’ చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నారు.