
కామారెడ్డి జిల్లాలో నకిలీ సదరం సర్టిఫికెట్ల కలకలం రేగింది. నకిలీ సర్టిఫికెట్లతొ ఉద్యోగాలు పొందినోళ్లను గుర్తించారు అధికారులు. మెడికల్ బోర్డు వైద్య పరీక్షల్లో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. నకిలీ సర్టిఫికెట్ ద్వారా 18 మంది దివ్యాంగుల కోటా కింద ఎంపికైనట్లు గుర్తించారు అధికారులు. టీఎస్పీఎస్సీ ద్వారా జరిగిన ఎంపిక పరీక్షలో తప్పుడు పత్రాలతో ఉద్యోగాలు పొందినట్లు తెలిపారు అధికారులు.
శారీరక లోపాలు, అంగవైకల్యం లేని వారు సైతం తప్పుడు మార్గాల్లో సదరం సర్టిఫికెట్స్ తో ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలిపారు అధికారులు. కొందరు తక్కువ అంగవైకల్యం పర్సెంటెజ్ ఉన్న ఎక్కువ ఉన్నట్లు సదరం సర్టిఫికెట్ జారీ చేసినట్లు గుర్తించారు.
ఈ ఘటనపై సీరియస్ అయ్యారు జిల్లా కలెక్టర్. నకిలీ పత్రాల ద్వారా ఉద్యోగాలు పొందిన జాబితాను డీఆర్డీఏకు పంపించి విచారణకు ఆదేశాలు జారీ చేశారు.