Reading Time: < 1 minute

ఖానాపూర్‌‌‌‌‌‌‌‌ చెరువును మినీ ట్యాంక్‌‌‌‌‌‌‌‌ బండ్‌‌‌‌‌‌‌‌గా మారుస్తాం : ఎమ్మెల్యే భూపతిరెడ్డి

Caption of Image.

నిజామాబాద్‌‌‌‌, వెలుగు: నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ రూరల్‌‌‌‌‌‌‌‌ మండలంలోని కాలూర్‌‌‌‌‌‌‌‌‒ఖానాపూర్‌‌‌‌‌‌‌‌ చెరువును మినీ ట్యాంక్‌‌‌‌ బండ్‌‌‌‌‌‌‌‌లా డెవలప్‌‌‌‌‌‌‌‌ చేయడానికి రూ.3.14 కోట్లతో పనులు చేపట్టామని రూరల్‌‌‌‌‌‌‌‌ఎమ్మెల్యే డాక్టర్‌‌‌‌‌‌‌‌ భూపతిరెడ్డి తెలిపారు. చెరువు వద్ద జరుగుతున్న  పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. 

ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం, చెరువులో నీటి నిల్వలు పెంచి గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ వాటర్‌‌‌‌ ‌‌‌‌వృద్ధి కోసం‌‌‌‌ పనులు చేస్తున్నట్లు చెప్పారు. మార్కెట్‌‌‌‌‌‌‌‌కమిటీ చైర్మన్‌‌‌‌ ‌‌‌‌ముప్ప గంగారెడ్డి, గీత పారిశ్రామిక సహకార కార్పొరేషన్‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ శేఖర్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌, కార్పొరేటర్‌‌‌‌ ‌‌‌‌అగ్గు భోజన్న తదితరులు పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.