
ఢిల్లీలో దారుణం జరిగింది.ఓ ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో అయన 22ఏళ్ళ కూతురు హత్యకు గురవ్వడం కలకలం రేపింది. బుధవారం ( ఏప్రిల్ 22 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. సౌత్ ఈస్ట్ ఢిల్లీలోని అమర్ కాలనీకి చెందిన సీనియర్ ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్, ఆయన భర్త కలిసి జిమ్ కి వెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆయన 22 ఏళ్ళ కుమార్తె ఇంట్లో శవమై కనిపించింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మృతురాలిపై అత్యాచారం చేసి.. ఆ తర్వాత మొబైల్ ఫోన్ ఛార్జింగ్ కేబుల్ తో గొంతు నులిమి చంపేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు పోలీసులు. ఈ ఘటన జరిగినప్పుడు బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉందని.. ఆమె తల్లిదండ్రులు జిమ్‌కు వెళ్లారని తెలిపారు పోలీసులు.
సుమారు ఆరు వారాల క్రితం పనిలో నుండి తీసేసిన పనిమనిషి ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు పోలీసులు. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో పనిమనిషి ఇంటికి సమీపంలోని సీసీ కెమెరాలో కనిపించడం అనుమానానికి తావిస్తోందని తెలిపారు పోలీసులు.
బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో, నిందితుడు ఆమెను లొంగదీసుకోవడానికి తలపై కొట్టి, ఆపై గొంతు నులిమి చంపినట్లు తెలుస్తోంది. మృతురాలి సివిల్స్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతోందని తెలిపారు తల్లిదండ్రులు. ఇంట్లో ఎవరు లేని సమయం గమనించి ఆమెను హత్య చేశారని అంటున్నారు.
రాజస్థాన్‌కు చెందిన నిందితుడు పరారీలో ఉన్నాడని… ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు తెలిపారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.