Reading Time: < 1 minute
Ap Tobacco Farmers %e2%82%b950000 Interest Free Loan %e2%82%b91000 Incentive

Tobacco Farmers: పొగాకు రైతులకు శుభవార్త చెబుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. పొగాకు ధరలు, రైతుల ఆర్థిక ఇబ్బందులు, నాణ్యత నిర్ధారణ వంటి అంశాలపై మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవి, డోలా బాల వీరాంజనేయస్వామి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పొగాకు రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేలా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి పొగాకు రైతుకు రూ.50 వేల వరకు వడ్డీలేని రుణం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రుణంపై రెండేళ్ల పాటు ఎలాంటి వడ్డీ ఉండదు. పొగాకు సాగులో రైతులకు ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

క్వింటాల్‌కు రూ.1,000 ప్రోత్సాహకం
ఇక, పొగాకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. కొనుగోలు చేసిన ప్రతి క్వింటాల్ పొగాకుకు రూ.1,000 రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకం అందించనుంది. రైతులకు నగదు చెల్లింపులు ఆలస్యం కాకుండా కొనుగోలు జరిగిన 9 రోజుల్లోనే ప్రోత్సాహక మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. మరోవైపు.. పొగాకు ధరలు, మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది రాష్ట్రంలో పొగాకు సాగును 80 మిలియన్ కిలోలకు పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్పత్తి, డిమాండ్ మధ్య సమతుల్యతను కొనసాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

నాణ్యతపై వ్యాపారుల ఇష్టారాజ్యానికి చెక్
పొగాకు నాణ్యత నిర్ధారణ విషయంలో వ్యాపారుల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఐదుగురు సభ్యులతో నాణ్యత నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ ద్వారా పొగాకు నాణ్యతను పారదర్శకంగా నిర్ధారించేలా చర్యలు తీసుకోనున్నారు. పొగాకు ధరల సమస్యపై మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవి, డోలా బాల వీరాంజనేయస్వామి సమీక్ష నిర్వహించారు. రైతులకు న్యాయమైన ధర, ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు మార్కెట్‌లో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.