
మీరట్: బ్లూ డ్రమ్ మర్డర్. మీరట్లో జరిగిన మర్చంట్ నేవీ అధికారి చావుకు సమాజం పెట్టిన పేరు ఇది. ఈ హత్యపై ఎన్ని మీమ్స్ వచ్చాయో లెక్కే లేదు. పెళ్లి చేసుకున్న కొత్త జంటలకు తమ స్నేహితులు సరదా కోసం బ్లూ డ్రమ్ను గిఫ్ట్గా ఇచ్చి మరీ సంబరపడ్డారంటే.. ఒకరి చావు ఎంత అపహాస్యానికి గురైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Remember the infamous “Blue drum” murder case of Meerut, UP? The mother of deceased Saurabh Rajput broke down when Muskaan, the prime accused in the chilling murder, appeared in court with her lover and her six-month-old daughter, Radha, in her arms.
Video via @Chhayakaar pic.twitter.com/RT3h5gszOi
— Piyush Rai (@Benarasiyaa) April 22, 2026
ఈ బ్లూ డ్రమ్లో ముక్కలుగా మిగిలిపోయిన సౌరభ్ రాజ్పుత్ ప్రాణం సమాజానికి ఒక మీమ్ మెటీరియల్ కావొచ్చేమో గానీ అతని కన్న తల్లికి మాత్రం అతని చావు తీరని కడుపు కోత మిగిల్చింది. ఒకరి చావును ఇంతలా అపహాస్యం చేస్తే ఆ కుటుంబం ఎంత మానసిక క్షోభకు గురవుతుందో, చింతిస్తుందో తెలియనంత శాడిజం నిండిన సొసైటీలో మనం బతుకుతున్నాం. ఇప్పుడు ఈ విషయం వార్తల్లోకి ఎక్కడం వెనుక ఉన్న అసలు విషయం ఏంటంటే.. మంగళవారం ఈ మర్చంట్ నేవీ అధికారి హత్య కేసు కోర్టులో విచారణకు వచ్చింది.
మంగళవారం మధ్యాహ్నం ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా కోర్టు దగ్గర వందలాది మంది ప్రజలు గుమిగూడారు. మర్చంట్ నేవీ అధికారి అయిన సౌరభ్ రాజ్‌పుత్‌ను అతని భార్య ముస్కాన్ రాజ్‌పుత్, ఆమె ప్రియుడు సాహిల్‌తో కలిసి హత్య చేసి, శరీరాన్ని ముక్కలు చేసి, ఒక నీలిరంగు డ్రమ్‌లో నింపేసి.. సిమెంటుతో మూసివేసి హత్య చేసిన కేసును కోర్టు విచారించడమే ఇందుకు కారణం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ముస్కాన్, ఆరు నెలల కుమార్తె రాధను చేతుల్లో పట్టుకుని కోర్టుకు హాజరైంది. ఆమె ప్రియుడు కూడా కోర్టులో హాజరయ్యాడు. కోర్టు గదికి అవతలి వైపున సౌరభ్ తల్లి రేణు దేవి, అతని సోదరుడు రాహుల్ నిలబడి ఉన్నారు.
Also Read : ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్.. భార్యతో కలిసి జిమ్ కు వెళ్లాడు : ఇంట్లో 22 ఏళ్ల కుమార్తె హత్య..!
ఇద్దరు నిందితులు కోర్టు గదిలోకి అడుగుపెట్టిన వెంటనే.. సౌరభ్ తల్లి కొడుకు హత్యను తల్చుకుని గుండెలు పగిలేలా రోదిచింది. కోర్టులోనే నిందితులు ఇద్దరికీ శాపనార్థాలు పెడుతూ.. చేతిలో చిన్న బిడ్డ ఉందని కనికరం చూపించవద్దని.. ఇద్దరికీ మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేసింది. ఈ నేరంలో ముస్కాన్ కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందని సౌరభ్ రాజ్పుత్ తల్లి రేణు దేవి ఆరోపించింది. వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కోర్టు విచారణ సందర్భంగా.. నిందితులను 32 ప్రశ్నలు అడిగారు. సాహిల్ తన తరఫున సాక్ష్యులను ప్రవేశపెట్టడానికి అనుమతి కోరగా.. ముస్కాన్ తనపై ఉన్న ఆరోపణలన్నింటినీ ఖండించింది.