Reading Time: < 1 minute

మంచిర్యాల జిల్లాలో బాలికను పెళ్లి చేసుకొని.. ఆరు నెలలుగా చిత్రహింసలు

Caption of Image.
  •     పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు

చెన్నూరు, వెలుగు: ప్రేమిస్తున్నాని మాయమాటలు చెప్పి బాలికను లొంగదీసుకొని పెళ్లి చేసుకున్నాడు. ఆరు నెలలు గడవక ముందే నాకు వద్దని వదిలిపెట్టాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్  చేసి రిమాండ్​కు తరలించారు. సీఐ బన్సీలాల్​ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా చెన్నూర్  మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన స్వామి అదే గ్రామానికి చెందిన 15 ఏండ్ల బాలికను ప్రేమిస్తున్నానని వెంట పడి మాయమాటలతో లొంగదీసుకున్నాడు. 

బాలికపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడి, గత ఏడాది అక్టోబర్ లో పెండ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిన నెల రోజుల నుంచి బాలికను అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నాడు. రెండు రోజుల కింద బాలికను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి నిందితుడు స్వామిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించినట్లు సీఐ తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.