Reading Time: < 1 minute

ఐపీఎల్ తర్వాత టీమిండియా బీజీ షెడ్యూల్.. బీసీసీఐ తీరుపై గంభీర్, గిల్ అసంతృప్తి

Caption of Image.

Team India: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ ఫైనల్ మే 31వ తేదీతో ముగియనుంది. అనంతరం భారత జట్టు వరుస సిరీస్ లతో బిజిబిజీగా ఉండనుంది. తీరిక లేకుండా మ్యాచ్ ల షెడ్యూల్ రూపొందించడంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బీసీసీఐ (భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు)పై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. జూన్ 6 నుంచి -10 మధ్య ముల్లాన్ పూర్ లో భారత్, అఫ్గానిస్థాన్ మధ్య టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్లతో ఎలాంటి సంబంధం లేదు. దీంతో అగ్రశ్రేణి ప్లేయర్స్ కి రెస్ట్ ఇచ్చి యంగ్ క్రికెటర్స్ ని బరిలోకి దింపాలని టీమిండియా మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. 

జస్ ప్రీత్ బుమ్రా,  శుభ్‌మన్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా లాంటి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఫస్ట్-క్లాస్ క్రికెట్ లో ఆకట్టుకున్న గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్, ఆకిబ్ నబీ, దేవదత్ పడిక్కల్ వంటి ప్లేయర్స్ ని అఫ్గానిస్థాన్ తో టెస్టు మ్యాచుకి సెలక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బీసీసీఐ అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఐపీఎల్ 2026 ముగియగానే టీమిండియా వరుస సిరీస్ లతో తీరిక లేకుండా క్రికెట్ ఆడనుంది. 

►ALSO READ | కాసేపట్లో SRH vs DC హై-స్కోరింగ్ పోరు.. వర్షంతో మ్యాచ్ జరిగేనా!

జూన్ మాసంలో అఫ్గానిస్థాన్ తో టెస్టు మ్యాచ్, మూడు వన్డేలని ఆడబోతుంది. తర్వాత రెండు టీ20ల సిరీస్ కోసం ఐర్లాండ్ టూర్ కి వెళ్లనుంది. ఇక జులై నెలలో ఇంగ్లాండ్ గడ్డపై పర్యటించి ఆతిథ్య జట్టుతో ఐదు వన్డేలు, 3 టీ20 మ్యాచుల్లో తలపడనుంది. అలాగే జులై 23వ తేదీ నుంచి జింబాబ్వే, టీమిండియా మధ్య మూడు టీ20ల సిరీస్ స్టార్ట్ కానుంది. దీంతో వరుస సిరీస్ లతో ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బంది పడతాడంతో పాటు జట్టులో గాయాల బెడద పెరిగే ఛాన్స్ ఉందని కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్ పేర్కొన్నట్లు తెలుస్తుంది.

©️ VIL Media Pvt Ltd.