
SRH vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న కీలక పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదట బ్యాటింగ్ చేసేందుకు క్రీజులోకి రానుంది. టాస్ గెలిచిన ఢిల్లీ ఛేజింగ్‌కు మొగ్గు చూపడంతో మంచు ప్రభావం ఉండే అవకాశం ఉన్న ఈ పిచ్‌పై హైదరాబాద్ భారీ స్కోరు సాధించాల్సి ఉంటుంది. మదుశంక రాకతో SRH బౌలింగ్ విభాగం మరింత బలోపేతమైంది. అక్షర్ పటేల్ తన 100వ మ్యాచ్‌లో జట్టును గెలిపిస్తాడా లేదా ఇషాన్ కిషన్ గ్యాంగ్ సొంత గడ్డపై హ్యాట్రిక్ కొడుతుందా అనేది వేచి చూడాలి.
ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్ నాకు చాలా ప్రత్యేకం.. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అతను 100వ మ్యాచ్ ఆడుతానని అనుకోలేదు.. టాస్ గెలవడం ఆనందంగా ఉంది. ఈ రాత్రి మ్యాచ్‌ను విజయంతో ముగించాలని ఆశిస్తున్నాను.. జట్టులో ఒక మార్పు చేశాం.. ఆకిబ్ నబీ స్థానంలో నితీష్ రాణా జట్టులోకి వచ్చాడని పేర్కొన్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. ఇది గత మ్యాచ్‌లాంటి పిచ్ అని నేను అనుకోవడం లేదు.. పక్కా ప్రణాళికలను అమలు చేయడమే మా లక్ష్యం.. ఈ మ్యాచ్ కోసం దిల్షాన్ మదుశంక, హర్ష్ దూబే జట్టులోకి తిరిగి వచ్చారని పేర్కొన్నాడు.
తుది జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్: పాతుమ్ నిస్సాంక, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సమీర్ రిజ్వీ, నితీష్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, టి నటరాజన్, లుంగి ఎన్గిడి
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివంగ్ కుమార్, హర్ష్ దూబే, సాకిబ్ హుస్సేన్, ఎషాన్ మలింగ
🚨 Toss 🚨@DelhiCapitals have won the toss and elected to bowl first against @SunRisers in Hyderabad.
Updates ▶️ https://t.co/VgUjXDlrDh#TATAIPL | #KhelBindaas | #SRHvDC pic.twitter.com/9pr4fTL6of
— IndianPremierLeague (@IPL) April 21, 2026