Reading Time: 2 minutes

బైక్పై హైవే మీద రయ్ రయ్మని దూసుకెళ్లిన అన్నదమ్ములు.. ముగ్గురూ స్పాట్ డెడ్ !

Caption of Image.

మౌగంజ్: మధ్యప్రదేశ్‌లో విషాద ఘటన జరిగింది. ఏమాత్రం బాధ్యత లేకుండా అడ్డదిడ్డంగా బైక్ డ్రైవింగ్ చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోయారు. మితిమీరిన వేగంతో ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సోదరులు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మౌగంజ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

పూర్తి నిర్లక్ష్యంతో.. అతి వేగంగా బైక్ డ్రైవింగ్ చేయడమే కాకుండా.. బైక్ పై ఇద్దరినీ ఎక్కించుకోవడం.. ఎలా పడితే అలా వాహనాలను ఓవర్ టేక్ చేయడం.. ఇలా ఓవర్ టేక్ చేస్తు్న్న క్రమంలో బైక్ అతి వేగం కారణంగా అదుపు తప్పి ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడం.. ఏమాత్రం బాధ్యత లేకుండా పిల్లలు పెరిగితే వాళ్ల జీవితాలు ఎలా తయారవుతాయనడానికి ఈ ఘటనే నిదర్శనం. అసలేం జరిగిందంటే.. వేరే మోటార్‌సైకిల్‌పై ఇద్దరు స్నేహితులు వీడియో రికార్డ్ చేస్తున్నారు.

►ALSO READ | ఆల్కహాల్‌తో నడవనున్న కార్లు, బైక్స్: E85 పెట్రోల్ తెస్తున్న ప్రభుత్వం.. మరి పాత వాహనాల పరిస్థితి?

అన్నదమ్ములైన ఉపలక్ష్ కోల్, అమ్రిష్ కోల్, హేమరాజ్ కోల్ ఒకే బైక్‌పై స్టంట్స్ చేస్తున్నారు. వీడియో వైరల్ చేయాలన్నదే వీళ్ల టార్గెట్. ఏ ఒక్కరూ హెల్మెట్ ధరించలేదు. అతి వేగంతో ట్రాఫిక్‌లో దూసుకుపోతూ, ఒక ట్రక్కుతో సహా ఇతర వాహనాలను ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించారు. ఒకరి చేతిలో పిస్టల్ కూడా కనిపించడం ఈ ముగ్గురూ ఎంత ఘోరంగా పెరిగారనడానికి సాక్ష్యంగా నిలిచింది.

తల్లిదండ్రులు పిల్లలను పట్టించుకోకుండా గాలికొదిలేస్తే జరిగే అనర్థమే ఇది. ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో ఒక లారీని దాటేందుకు ప్రయత్నిస్తుండగా ఆగి ఉన్న ఇటుకల లోడ్ తో ఉన్న లారీని వీళ్ల బైక్ ఢీ కొట్టింది. మితిమీరిన వేగంతో ఢీ కొట్టడంతో ఆ ముగ్గురు సోదరులు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. వీడియో చిత్రీకరిస్తున్న స్నేహితులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. 22 సెకన్ల వ్యవధిలోనే ఇదంతా జరిగింది.

©️ VIL Media Pvt Ltd.