
కన్నడ చిత్ర పరిశ్రమను గర్వించదగ్గ స్థాయికి తీసుకెళ్లడంలో ‘కేజీఎఫ్’ (KGF) ఫ్రాంచైజీ కీలక పాత్ర పోషించింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ సృష్టించిన ఈ ఊచకోత బాక్సాఫీస్ వద్ద వేల కోట్లు కొల్లగొట్టింది. అంతేకాదు, హీరో యష్‌ను గ్లోబల్ స్టార్‌ను చేసింది. అయితే, గత రెండేళ్లుగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ‘కేజీఎఫ్ 3’పై లేటెస్ట్ గా యష్ క్లారిటీ ఇచ్చారు.
వరుస సినిమాలతో బిజీ..
రాకింగ్ స్టార్ యష్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తన దృష్టాంతా ఈ భారీ ప్రాజెక్టులపైనే పెట్టారు. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ ఎపిక్ డ్రామా ‘రామాయణం’లో యష్ ‘రావణుడు’గా నటిస్తున్నారు. అలాగే, గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘టాక్సిక్’ (Toxic) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అమెరికాలో జరిగిన సినిమాకాన్ (CinemaCon) 2026 వేదికగా ఆయన మాట్లాడూతూ.. కేజీఎఫ్ 3 ఇప్పట్లో ఉండదని తేల్చి చెప్పారు. నా చేతిలో ప్రస్తుతం రామాయణం 1 , 2 తో పాటు టాక్సిక్ ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు కేజీఎఫ్ 3 ప్రారంభమయ్యే అవకాశం లేదు అని యష్ స్పష్టం చేశారు.
‘రాఖీ భాయ్’ రీ-ఎంట్రీ ఎప్పుడంటే?
కేజీఎఫ్ 3 అటకెక్కినట్లేనా? అని భయపడుతున్న ఫ్యాన్స్‌కు ఆయన ఒక ఆశాజనకమైన మాట చెప్పారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ నిరంతరం టచ్‌లోనే ఉన్నా.. కేజీఎఫ్ 3 కచ్చితంగా వస్తుంది. కానీ, కేవలం సీక్వెల్ చేయాలనే ఉద్దేశంతో కాకుండా, మొదటి రెండు భాగాలను మించే పవర్‌ఫుల్ స్క్రిప్ట్ సిద్ధమైనప్పుడే సెట్స్‌పైకి వెళ్తామని స్పష్టం చేశారు. నిర్మాణంలో తొందరపడటం కంటే నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తామని క్లారిటీ ఇచ్చేశారు.
ALSO READ : బాలయ్య ప్రాజెక్ట్‌లో హీరోయిన్ చేంజ్
‘టాక్సిక్’పై క్రేజీ అప్‌డేట్
‘టాక్సిక్’ కేవలం గ్యాంగ్‌స్టర్ సినిమాగానే కాకుండా,లోతైన భావోద్వేగాలు ఉంటాయని యష్ వివరించారు. గోవా విముక్తి పొందని కాలం (1961కి ముందు) నేపథ్యంలో, ఒక తండ్రి-కొడుకుల మధ్య ఉండే ప్రేమాభిమానాలు, రివెంజ్ డ్రామా చుట్టూ ఈ కథ తిరుగుతుందట. అధికారం, రాజకీయాలు,అత్యాశ వంటి అంశాలను ఇందులో ఉంటాయని యష్ తెలిపారు..
మొత్తానికి మళ్ళీ వెండితెరపై ‘ రాఖీ భాయ్’గా చూడాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. అయితే ప్రస్తుతం యష్ చేస్తున్న ‘రామాయణం’, ‘టాక్సిక్’ వంటి చిత్రాలు కచ్చితంగా ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించేలా ఉంటాయని ఫ్యాన్స్, సినీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
At first we thought its regular gangster movie but yash at cinecon said, Toxic is an original IP that fearlessly explores emotions and the dark human side.
I will be glad if it’s true bcz yash deserve something special after all he is coming back after 4 years pic.twitter.com/U4ePqyOTda
— ` (@chixxsays) April 15, 2026