Reading Time: 2 minutes

SRH vs DC మధ్య ఉత్కంఠ పోరు.. గెలిచేది మాత్రం ఈ జట్టే

Caption of Image.

SRH vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ సొంత గడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ ని ఢీ కొట్టబోతోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 6 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న SRH, హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. 

హెడ్-టు-హెడ్ రికార్డ్స్
సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య రికార్డులు చూస్తుంటే పోరు ఎంత టైట్‌గా ఉంటుందో అర్థమవుతోంది. ఈ ఇరు టీమ్స్ మధ్య పోరులో SRH 13 విజయాలతో ముందుండగా, ఢిల్లీ 12 మ్యాచులలో గెలిచింది. 

జోరు మీదున్న SRH: 
ఈ సీజన్ ప్రారంభంలో తడబడినప్పటికీ, గత రెండు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌పై సాధించిన విజయాలు SRHలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ వంటి విధ్వంసకర ఆటగాళ్లతో హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. బౌలింగ్‌లో హర్షల్ పటేల్, గెరాల్డ్ కోయెట్జీ ప్రత్యర్థి జట్టుని కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

పుంజుకుంటున్న ఢిల్లీ క్యాపిటల్స్: 
అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ గత మ్యాచ్‌లో RCBపై సంచలన విజయం సాధించి మంచి ఊపులో ఉంది. ముఖ్యంగా డేవిడ్ మిల్లర్ లాస్ట్ ఓవర్ ఫినిషింగ్ ఆ జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్. KL రాహుల్, నితీష్ రాణా వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు స్పిన్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై కీలకం కానున్నారు.

పిచ్ రిపోర్ట్: 
ఉప్పల్ స్టేడియంలోని పిచ్ నంబర్ 5పై ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లు తక్కువ స్కోరింగ్‌కే పరిమితమయ్యాయి. కాబట్టి, టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఇక మొదట బ్యాటింగ్ చేసే జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేసి, తర్వాత మంచు ప్రభావం లేదా పిచ్ మార్పులను బట్టి ఛేజింగ్ చేయడం సులభం కావచ్చు.

►ALSO READ | బాయ్.. కాస్తా కూల్‎గా ఉండమని చెప్పినా: హార్ధిక్‎తో హాట్ డిస్కషన్‎పై తిలక్ క్లారిటీ

విజేత ఎవరంటే?: 
తక్కువ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉన్న ఈ పిచ్‌పై, స్పిన్నర్లు, నెమ్మదిగా ఆడే బ్యాటర్లు ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు విజయావకాశాలు కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ల స్పిన్ ద్వయం హైదరాబాద్ బ్యాటర్లను ఎలా అడ్డుకుంటుందనే దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. 

తుది జట్ల అంచనా: 

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా (వికెట్ కీపర్), శివాంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, సకీబ్ హుస్సేన్, ఎషాన్ మలింగ, హర్షన్ పటేల్
ఇంపాక్ట్ ప్లేయర్స్: లియామ్ లివింగ్‌స్టోన్, ఉనద్కత్, కమిందు మెండిస్

ఢిల్లీ క్యాపిటల్స్: పాతుమ్ నిస్సాంక, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ఔకిబ్ నబీ దార్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, టి నటరాజన్, 
ఇంపాక్ట్ ప్లేయర్స్: లుంగి ఎంగిడి, దుష్మంత చమీర, అశుతోష్ శర్మ, అభిషేక్ పోరెల్

©️ VIL Media Pvt Ltd.