
సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు శుభవార్త. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ ఎట్టకేలకు షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఈ సందర్భాన్ని పురష్కరించుకుని చిత్ర యూనిట్ లేటెస్ట్ గాసెట్స్ లో సంబరాలు జరుపుకుంది. భారీ కేక్ కట్ చేసి వేడుకను నిర్వహించింది. ఈ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటోలను నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ‘అలప్పరై కిలప్పరోమ్ .. తలైవరు నిరంతరం ‘ పోస్ట్ చేసింది. ఈ ఫొటోలను చూసి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
శరవేగంగా షూటింగ్ పూర్తి..
ఈ ఏడాది మార్చి 10న చెన్నైలో ప్రారంభమైన ఈ ‘జైలర్ 2’ సినిమా షూటింగ్ అత్యంత వేగంగా పూర్తయింది. మొదటి పార్ట్ దాదాపు రూ. 650 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడంతో, సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం మరింత హైలెట్ గా నిలవనుంది.
లీకులతో టెన్షన్
సినిమాపై ఇంతటి క్రేజ్ ఉన్న తరుణంలో.. ఇటీవల జరిగిన ఒక షాకింగ్ ఘటన చిత్ర యూనిట్‌ను కలవరపెట్టింది. షూటింగ్ సెట్స్ నుండి ఒక కీలక వీడియో క్లిప్ ఆన్‌లైన్‌లో లీకై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై సన్ పిక్చర్స్ కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. లీకైన కంటెంట్‌ను షేర్ చేసినా, రీపోస్ట్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని, సదరు ఖాతాలను నిలిపివేసేలా యాంటీ పైరసీ టీమ్ పని చేస్తోందని స్పష్టం చేసింది. ఇటీవలే దళపతి విజయ్ సినిమా ‘జన నాయకన్’ కూడా ఇలాగే లీక్ అవ్వగా, సదరు నిర్మాణ సంస్థ ఎనిమిది మందిని, ఒక అసిస్టెంట్ ఎడిటర్‌ను అరెస్ట్ చేయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జైలర్ 2 టీమ్ కూడా అదే దిశగా చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది.
కథా నేపథ్యం..
ఈ మూవీలో రజనీకాంత్‌తో పాటు రమ్యకృష్ణ, యోగి బాబు తమ పాత్రలను కొనసాగిస్తుండగా, ఈసారి మరికొంతమంది స్టార్ నటులు అతిథి పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. రిటైర్డ్ జైలర్ ముత్తువేల్ పాండియన్ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటం మొదటి భాగంలో ఉంటే, రెండో భాగంలో మరింత పవర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్, ఇంటర్నేషనల్ మాఫియా లింకులు ఉండబోతున్నాయని టాక్ .
►ALSO READ | Sai Abhyankar: ‘రాకా’ ఆల్బమ్‌పై బిగ్ అప్డేట్.. సౌండ్ ట్రాక్, సాంగ్స్‌పై మ్యూజిక్ డైరెక్టర్ ఓపెన్
షూటింగ్ పూర్తవ్వడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసి, ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. మొత్తానికి ‘టైగర్’ ముత్తువేల్ పాండియన్ బాక్సాఫీస్ వేట మళ్ళీ మొదలవబోతోంది..