
Virat Kohli: ఇటీవల టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌తో బిగ్ బాస్ 13 ఫేమ్, ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్ షెఫాలీ బగ్గా కలిసి ఉన్న వీడియో ఒకటి వైరల్ కావడంతో, వీరిద్దరు డేటింగ్ చేసుకుంటున్నారనే ప్రచారం జోరుగా ఊపందుకుంది. ఈ తప్పుడు ప్రచారంపై షెఫాలీ బగ్గా సోషల్ మీడియాలో తనపై వస్తున్న డేటింగ్ వార్తలపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ముఖ్యంగా క్రికెటర్లతో తనని ముడిపెడుతూ వస్తున్న గాసిప్స్ పై తీవ్రంగా మండిపడింది. ప్రజల ఆలోచనా విధానం మరీ చిన్నదిగా ఉంది. ఒక డిన్నర్‌కు వెళ్తే అది డేటింగ్ అని ఎలా అనుకుంటారు? ఇలాంటి చిన్నచూపుతో నేను విసిగిపోయాను.. వాస్తవం ఏంటో నాకు, నా ఆత్మీయులకు తెలుసు అని పేర్కొంది.
నా వ్యక్తిగత జీవితం వేరు!:
క్రికెటర్లతో రిలేషన్‌షిప్‌పై ఆమెకు స్పష్టమైన అభిప్రాయం ఉంది. ఇది నా వృత్తి (Profession).. నా ప్రొఫెషన్, వ్యక్తిగత జీవితాన్ని కలిపే ఉద్దేశం అస్సలు లేదు.. అందుకే క్రికెటర్లతో డేటింగ్ చేసే ఆలోచన లేదని షెఫాలీ బగ్గా తేల్చి చెప్పింది.
►ALSO READ | ఉప్పల్‌లో మరో హై-వోల్టేజ్ డ్రామా.. హ్యాట్రిక్ విజయంపై SRH నజర్!
కోహ్లీ లాంటి ‘పర్ఫెక్ట్ పార్ట్నర్’ కావాలి!:
తనకు కాబోయే భాగస్వామి ఎలా ఉండాలో వివరిస్తూ, విరాట్ కోహ్లీ -– అనుష్క శర్మ జంటను ఉదాహరణగా చూపించారు. విరాట్ ఎంత బిజీగా ఉన్నా అనుష్క పట్ల చూపించే ఆ అంకితభావం, ఆరాధన తనకు ఇష్టమని ఆమె పేర్కొన్నారు. తన భాగస్వామి తనతో ఉన్నప్పుడు పూర్తిగా తనకే సమయం కేటాయించాలని, తనపైనే పూర్తి శ్రద్ధ పెట్టాలని ఆకాంక్షించింది. లగ్జరీల కంటే ప్రేమించే మనసు, తనను కేర్ చేసే గుణం ఉంటే చాలని షెఫాలీ బగ్గా వెల్లడించింది.
కెరీర్‌పైనే ఫోకస్!:
ప్రస్తుతానికి ప్రేమ, పెళ్లి లాంటి విషయాల కంటే తన కెరీర్‌కే అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు షెఫాలీ బగ్గా వెల్లడించారు. ఐపీఎల్ లాంటి ప్రతిష్టాత్మక లీగ్స్‌లో యాంకర్‌గా రాణిస్తున్న షెఫాలీ, త్వరలో బాలీవుడ్, సౌత్ ఇండియన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాల వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.
Yuzvendra Chahal unfollowed RJ Mahvash a couple of days ago,
shared a Mahabharat-style motivation story right after…
and now he’s been spotted at a restaurant with Shefali BaggaLooks like bro truly believes in
“Ek jayegi, toh dusri aayegi.” 🤣 pic.twitter.com/Axb4HYkX7U— Ravi Chaudhary (@BURN4DESIRE1) January 25, 2026