
ఈ జీవితం ఇంతేనా.. మార్పు రాదా.. డబ్బు రాదా.. అవకాశాలు రావా అని బాధపడుతున్న కొన్ని రాశుల వారికి శుభవార్త. 2026, ఏప్రిల్ 25వ తేదీ తర్వాత గ్రహాల మార్పు జరుగుతుంది. మిధున రాశిలోకి శుక్రుడు రావటం.. వృషభ రాశిలోకి సూర్యుడు, మేష రాశిలోకి బుధుడు, కర్కాటకంలోకి గురువు రావటం జరుగుతుంది. ఈ గ్రహాల మార్పు వల్ల ముఖ్యంగా 5 రాశుల వాళ్లకు మాత్రం అదృష్టం తన్నుకుంటూ వస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అదృష్ట యోగం పట్టబోతున్న ఆ ఐదు రాశులు ఏంటో.. వాళ్లకు వచ్చే అవకాశాలు ఏంటో వివరంగా.. జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా తెలుసుకుందాం..
వృషభ రాశి :
వృషభ రాశి వాళ్ల అత్యంత అనుకూలమైన దశలోకి ప్రవేశిస్తున్నారు. ఏప్రిల్ 25వ తేదీ తర్వాత ఈ రాశి వాళ్లల్లో స్థిరత్వం వస్తుంది. కొంత కాలంగా ఈ రాశి వాళ్లు పడుతున్న కష్టానికి ప్రతిఫలం వచ్చే సమయం ఆసన్నమైంది. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు అన్నీ చకచకా అయిపోతాయి. అనుకున్న విధంగా డబ్బు చేతికి వస్తుంది. జీవితం గాడిలో పడింది.. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునేంతగా మీకు అదృష్టం పడుతుంది. ఇప్పటి వరకు రావు.. ఇక రాదు అనుకున్న డబ్బు వచ్చేస్తుంది. కొత్త పెట్టుబడులపై ఆలోచిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడులపై లాభం వస్తుంది. ఇక ఉద్యోగ విషయంలో ప్రమోషన్ వచ్చే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. వచ్చిన ఉద్యోగంలో మీకు హ్యాపీ ఉంటుంది. వీటన్నింటి కంటే ముఖ్యంగా మీరు చేయాల్సింది ఒకటి ఉంది. సహనం కోల్పోవద్దు.. కోపం వద్దు. ఓపికగా ఉండండి.. డబ్బులు వచ్చినా ఆర్భాటాలకు పోకుండా ఉండాలి.
మిధున రాశి :
మిధున రాశి వాళ్లకు ఏప్రిల్ 25వ తేదీ తర్వాత టైం తెలియనంతగా జీవితం వేగంగా గడిచిపోతుంది. చకచకా పనులు అయిపోతాయి. కమ్యూనికేషన్, నెట్ వర్కింగ్ రంగాల్లో ఉద్యోగం, వ్యాపారం చేసే వాళ్లకు ఇది మంచి సమయం. డబ్బుకు డబ్బు వస్తుంది.. ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. కొత్త పరిచయాలు మీ విజయానికి మార్గంగా ఉంటాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించి మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగం, వ్యాపారంలో మీరు ప్రదర్శించే తెలివితేటలు శుభ ఫలితాలను ఇస్తాయి. మీకు ఎదురయ్యే ఇబ్బందులు, కష్టాలను సైతం చాకచక్యంగా అధిగమిస్తారు. వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతారు. ఏప్రిల్ 25వ తేదీ తర్వాత నుంచి మిధునరాశి వాళ్లకు అనుకున్నది అనుకున్నట్లు జరిగే సూచనలు జ్యోతిష శాస్త్రం పరంగా గట్టిగా ఉన్నాయి.
సింహ రాశి :
ఏప్రిల్ 25వ తేదీ తర్వాత సింహ రాశి వారు శక్తివంతమైన దశలోకి ప్రవేశిస్తారు. ఇన్నాళ్లు మీరు పడుతున్న కష్టానికి గుర్తింపు, ప్రయోజనం లభించే రోజులు వచ్చేశాయి. ఉద్యోగం చేసే సింహ రాశి వాళ్లకు పదోన్నతి దక్కే ఛాన్స్ 80 శాతం వరకు ఉంది. పై అధికారుల నుంచి మన్ననలు పొందుతారు. మీరు నాయకత్వం హోదా ( టీం లీడర్) హోదాలో ఉన్నట్లయితే ఉన్నతాధికారుల నుంచి పొగడ్తలు వింటారు. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ వచ్చే సూచనలు ఉన్నాయి. మీలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. మీ శక్తి సామర్థ్యాలు మీకే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే.. మంచి లాభాలు గడిస్తారు. మీలో అంతర్గతంగా ఉన్న శక్తి.. ఈ కాలంలో మరింతగా మిమ్మల్ని ముందుకు తీసుకెళుతుంది. కొన్ని పనులు అలా అలా అయిపోతూ.. ఎక్కువగా కష్టపడకుండానే పనులు అయిపోతూ.. మంచి ప్రతిఫలం చేతికి అందుతుంది.
ALSO READ : : ధైర్యమంటే ఏంటీ.. ధైర్యవంతులు అని ఎవర్ని అంటారు..
వృశ్చిక రాశి :
వృశ్చిక రాశి వాళ్లకు సహజంగా ఉండే భావోద్వేగం అనేది.. ఏప్రిల్ 25 తర్వాత స్థిరత్వాన్ని తీసుకొస్తుంది. అతి ఆవేశం.. అతిగా ఆందోళన.. అతిగా మధన పడటం అనేది తగ్గి.. స్థిరంగా ఉండటానికి గ్రహాలు అనుకూలిస్తాయి. కొన్నాళ్లుగా అంతర్గతంగా.. రహస్యంగా చేస్తున్న పనులు ఇప్పుడు బయట ప్రపంచానికి వస్తాయి. వాటి ద్వారా ఫలితాలు రావటం ప్రారంభం అవుతాయి. ఈ వృశ్చిక రాశి వాళ్లు ఉద్యోగం చేస్తున్నట్లయితే మీ ఆలోచనలు, నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ప్రమోషన్, ఇంక్రిమెంట్ వంటివి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కొంతకాలంగా మీరు చేస్తున్న పోరాటాలు ముగింపు దశకు వచ్చి.. వాటి ఫలితాలు మీకు సానుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. మీలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఇప్పటి వరకు తీవ్రంగా ఎదుర్కొంటున్న ఒత్తిడి.. మానసిక వేదన నుంచి రిలీఫ్ దొరుకుతుంది. ఆకస్మికమైన మార్పులు రావొచ్చు. వాటిని అంతే సమర్థవంతంగా స్వీకరిస్తారు. అనుకూల ఫలితాలనే సాధిస్తారు.
కుంభ రాశి :
కుంభ రాశి వాళ్లకు ఆకస్మిక అవకాశాలు వెల్లువెత్తుతాయి. ఏప్రిల్ 25వ తేదీ తర్వాత మీకు మీరే ఆశ్చర్యపోవటం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వాళ్లే కాదు.. వ్యాపార రంగంలో ఉన్న వాళ్లకు కూడా ఊహించని విధంగా అవకాశాలు వస్తాయని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది. ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు చేస్తున్న వాళ్లు విజయం సాధిస్తారు. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల నుంచి మద్దతు లభిస్తుంది. మీకు వచ్చే అద్భుతమైన ఐడియాలు ముందుకు తీసుకెళ్లటంలో మీకు అందరి నుంచి సపోర్ట్ వస్తుంది. సరైన సమయంలో సరైన వ్యక్తులను కలిశాను అన్న ఫీలింగ్ మీలో వస్తుంది. కొత్త పరిచయాలు విజయాలకు దారి తీస్తాయి.
12 రాశుల్లో ఈ 5 రాశుల వాళ్లకు మాత్రం మంచి యోగ కాలం అని చెప్పొచ్చు. ఏప్రిల్ 25వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు ఉన్న ఈ కాలంలో.. ఈ 5 గ్రహాల వాళ్లకు అదృష్టం అని చెబుతోంది జ్యోతిష్య శాస్త్రం.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.