
పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. మద్యానికి బానిసైన తండ్రి డబ్బుల కోసం వేధిస్తుండటంతో కొడుకే ఇటుకతో తలపగలకొట్టి చంపేశాడు. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..పెద్దపల్లి పట్టణంలోని ఈద్గా కాలనీలో జరిగింది ఈ దారుణం. ఈద్గా కాలనీకి చెందిన సయ్యద్ జాబేర్ ను తన కుమారుడు ఇటుకతో కొట్టి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
సయ్యద్ జాబేర్ పెద్దపల్లి పట్టణంలో లారీ క్లీనర్ గా పనిచేసేవాడు. జాబేర్ కు ఇద్దరు భార్యలు కాగా… మొదటి భార్యకు విడాకులు ఇచ్చి ఆమె సోదరిని రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు.మొదటి భార్య కుమారుడు,రెండో భార్య పిల్లలు అందరూ కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. పిల్లలు హోటళ్లలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా.. జాబేర్ గత కొంతకాలంగా మద్యానికి బానిసై పనికి వెళ్లడం మానేశాడు.
ALSO READ : ప్రేమపేరుతో మోసం.. అశ్లీల వీడియోలు చూపి..
మద్యానికి బానిసైన తండ్రి వేధింపులు భరించలేక అతని కొడుకు ఇటుకతో తలపగలకొట్టి చంపేశాడు. పిల్లలు కష్టపడి సంపాదించిన డబ్బులను కూడా మద్యం కోసం అడుగుతూ నిత్యం వారిని శారీరకంగా,మానసికగా వేధించేవాడనీ కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..నిందితుడైన కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.