Reading Time: < 1 minute

AI వల్ల జాబ్స్ పోతున్నయ్ అనేది అబద్ధం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఇప్పుడే పని పెరిగింది: ఎన్వీడియా సీఈఓ

Caption of Image.

ప్రపంచాన్ని AI మింగేస్తుందని.. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల కోడింగ్ ఉద్యోగాలను ఖతం చేస్తుందని వస్తున్న వార్తలపై టెక్ దిగ్గజం ఎన్వీడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే ప్రచారం పచ్చి అబద్ధం అని తేల్చి చెప్పారు. ఇలాంటి నెగటివ్ వార్తలు అమెరికా టెక్ రంగాన్ని దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.

చాలామంది ఏఐ వల్ల కోడింగ్ అవసరం ఉండదు అనుకుంటున్నారు. కానీ తన సొంత సంస్థ ఎన్వీడియాలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉందని హువాంగ్ వెల్లడించారు. తమ దగ్గర అడ్వాన్స్‌డ్ ఏజెంటిక్ ఏఐ సిస్టమ్స్ వాడుతున్నట్లు చెప్పారు. కానీ తమ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు మునుపటి కంటే ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారని వెల్లడించారు. ఏఐ అనేది మనిషికి ప్రత్యామ్నాయం కాదు.. అది ప్రొడక్టివిటీని పెంచే పరికరం మాత్రమే అని చెప్పారు.

సాధారణంగా చేసే బోరింగ్ కోడింగ్ పనులను ఏఐ వేగంగా పూర్తి చేస్తుంది. దీనివల్ల ఇంజనీర్లకు మరింత క్లిష్టమైన ప్రాజెక్టులు, కొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టే సమయం దొరుకుతుందని ఎన్వీడియా సీఈఓ అంటున్నారు. అంటే ఏఐ ఇంజనీర్ల పనిని తగ్గించడం లేదు.. బదులుగా వారు చేయగలిగే పని పరిధిని పెంచుతోందన్నమాట. ఇంజనీర్లు ఇప్పుడు మరింత వేగంగా ఫీచర్లను విడుదల చేస్తున్నారని, ఏఐ వారి పనులను సులభతరం చేసి మరింత చురుగ్గా మార్చిందని హువాంగ్ టెక్కీలకు భరోసా ఇచ్చారు.

ALSO READ : ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్ ఇన్‌ఫ్లుయెన్సర్..

మరి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
టెక్ ప్రపంచంలోని కొంతమంది జూనియర్ లెవల్ ఉద్యోగాలపై ఏఐ ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నప్పటికీ.. హువాంగ్ మాత్రం పాజిటివ్ కోణాన్ని చూపిస్తున్నారు. భవిష్యత్తులో కేవలం కోడింగ్ రాయడమే కాకుండా.. ఏఐ సిస్టమ్స్ నిర్వహణ, సిస్టమ్ ఆర్కిటెక్చర్, క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ వంటి నైపుణ్యాలకు భారీ డిమాండ్ ఉంటుందని ఈ డేటా చెబుతోంది. టెక్కీలు భయపడాల్సిన పని లేదని, ఏఐతో కలిసి ప్రయాణించడం నేర్చుకుంటే కెరీర్‌లో తిరుగుండదని జెన్సన్ హువాంగ్ మాటలు స్పష్టం చేస్తున్నాయి. నిత్యం కోడింగ్‌తో కుస్తీ పట్టే డెవలపర్లకు ఇది నిజంగా పెద్ద రిలీఫ్ అంటున్నారు మరికొందరు టెక్ నిపుణులు.

©️ VIL Media Pvt Ltd.