Reading Time: < 1 minute

ప్రభుత్వ ఉద్యోగులకు నెలకు 2 సార్లు జీతం.. కొత్త విధానం తెచ్చిన నేపాల్

Caption of Image.

ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా జీతం రావడం అనేది దశాబ్దాలుగా వస్తున్న ఆచారం. అయితే పొరుగు దేశం నేపాల్ ఈ పాత పద్ధతికి స్వస్తి పలికి ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులకు నెల చివరి వరకు వేచి చూడాల్సిన అవసరం లేకుండా.. ప్రతి 15 రోజులకు ఒకసారి శాలరీ పేమెంట్ చేసేలా కొత్త విధానాన్ని తీసుకొస్తోంది. దీనికి సంబంధించి నేపాల్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

ఎందుకు ఈ మార్పు?
ఈ నిర్ణయం వెనుక ఒక బలమైన ఆర్థిక వ్యూహం ఉంది. సాధారణంగా నెలాఖరు వచ్చేసరికి మధ్యతరగతి ఉద్యోగుల చేతిలో డబ్బులు ఉండక ఇబ్బంది పడుతుంటారు. 15 రోజులకోసారి డబ్బులు చేతికి అందడం వల్ల.. పిల్లల స్కూల్ ఫీజులు, కరెంట్ బిల్లులు, రోజువారీ ఖర్చులను మేనేజ్ చేయడం సులభం అవుతుంది. మార్కెట్‌లో నెలాఖరున వచ్చే మందగమనం తగ్గి, వ్యాపారాలు పుంజుకుంటాయి. అలాగే చిన్న చిన్న అవసరాల కోసం ఇతరుల దగ్గర అప్పులు చేయాల్సిన అవసరం తప్పుతుంది.

►ALSO READ | ఇన్ స్టాగ్రామ్ వార్ : టాప్ మోడల్ క్లాడియాను కొట్టి.. కారు కింద తొక్కి చంపిన ప్రత్యర్థులు..!

డబ్బు చేతిలో నిరంతరం తిరుగుతూ ఉంటేనే ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుంది. నెల మొత్తం ఒకేసారి కాకుండా.. విడతల వారీగా నగదు ప్రవాహం ఉండటం వల్ల రిటైల్ వ్యాపారులకు, చిన్న బిజినెస్ గిరాకీలకు మేలు జరుగుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే ఈ ఫోర్ట్‌నైట్లీ పేమెంట్ పద్ధతి అమల్లో ఉంది. ఇప్పుడు నేపాల్ కూడా అదే బాటలో నడుస్తూ.. దక్షిణాసియా దేశాలకు ఒక రోల్ మోడల్‌గా నిలవబోతోంది. ఈ కొత్త విధానం సక్సెస్ అయితే, భవిష్యత్తులో మిగిలిన దేశాలు కూడా దీనినే ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆర్థికవేత్తలు అంటున్నారు. 

©️ VIL Media Pvt Ltd.