Reading Time: < 1 minute

జెఈఈ మెయిన్ 26 ఫలితాల్లో శ్రీ చైతన్య రికార్డు

Caption of Image.

జె.ఈ.ఈ మెయిన్స్ 2026 ఫలితాల్లో తమ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థాలు టాప్ ర్యాంకులు సాధించారని శ్రీచైతన్య విద్యాసంస్థల అకాడమిక్ డైరెక్టర్ సుష్మ బొప్పన తెలిపారు. జె.ఈ.ఈ మెయిన్స్ 2026 ఫలితాల్లో శ్రీ చైతన్యకు చెందిన ఇద్దరు విద్యార్థులు 300 కు 300 మార్కులు సాధించారని అకాడమిక్ డైరెక్టర్ సుష్మ బొప్పన తెలిపారు. అంతేకాకుండా ఆల్ ఇండియా ఓపెన్ క్యాటగిరిలో టాప్ 10,100, 1000 లోపు అత్యధిక ర్యాంకులు శ్రీ చైతన్య విద్యార్థులే కైవసం చేసుకొని రికార్డు సృష్టించారన్నారు.

ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ లోని దసపల్ల హోటల్ లో శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పూర్తి మార్కులతో తమ ఇద్దరు విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంకులు సాధించడం తమ విద్యా సంస్థలకు గొప్ప మైలురాయి అన్నారు. 

అంతేకాకుండా ఆల్ ఇండియా ఓపెన్ క్యాటగిరిలో టాప్ 10,100, 1000 లోపు అత్యధిక ర్యాంకులు శ్రీ చైతన్య విద్యార్థులే కైవసం చేసుకొని రికార్డు సృష్టించారన్నారు. శ్రీ చైతన్య బెంగుళూరు విద్యార్థి నిశాంక్ వ్యాస్ ఏయిర్ 396 ర్యాంకును,ఎయిర్ 98,107, 826 వంటి టాప్ ర్యాంకులు సొంతం చేసుకున్నామన్నారు. దీనికి శ్రీ చైతన్య సంస్థలు అవలంబిస్తున్న విద్యా విధానమే కారణమని తామందించే మైక్రో షెడ్యూల్స్ నిరంతర ఇంటర్నల్ ఎగ్జామ్స్, తమ అత్యుత్తమ ఫ్యాకల్టీలు, అధునాతన లర్నింగ్ ప్లాట్ ఫాం తోపాటు కష్టపడి చదివే విద్యార్థులు విజయం సాధించడంతోపాటు సంస్థకు వన్నెతెస్తున్నారని తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.