Reading Time: 2 minutes

ఓటీటీలోకి మంచు లక్ష్మి ‘లేచింది మహిళా లోకం’.. సటైరికల్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Caption of Image.

తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్నమైన కథాంశాలను ఎంచుకోవడంలో మంచు లక్ష్మీ ఎప్పుడూ ముందుంటారు. ఆమెతో పాటు శ్రద్ధా దాస్, అనన్య నాగళ్ల, హరితేజ, సుప్రీత నాయుడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లేచింది మహిళా లోకం’. ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండాఈ మూవీ మార్చి 26, 2026న సైలెంట్ గా థియేటర్లలోకి వచ్చింది.  ప్రేక్షకులను ఆకట్టుకోలేపోయిన ఈమూవీ బాక్సాఫీస్ వద్ద బొల్తా పడింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ ప్లాట్ ఫామ్ పై తన అదృష్ణాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయింది.

సటైరికల్ కామెడీతో ..

లింగ వివక్ష, సమాజంలో మహిళలపై ఉన్న మూస పద్ధతులు వంటి సున్నితమైన అంశాలను ఈ సినిమాలో వ్యంగ్యాస్త్రాలతో జోడించారు. అర్జున్ , కార్తీక్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం, మహిళలు తమ హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం చేసే పోరాటాన్ని కామెడీ డ్రామాగా మలిచింది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో సందడి చేయలేకపోయినా, కథలోని లోతు , నటీమణుల పెర్ఫార్మెన్స్ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.

OTT వేదికగా సెకండ్ ఇన్నింగ్స్

ఈ చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ Sun NXT దక్కించుకుంది. ఏప్రిల్ 22, 2026 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో మిస్ అయిన చాలా చిన్న సినిమాలు ఓటీటీలో అద్భుతమైన వ్యూయర్‌షిప్ సాధించిన సందర్భాలు ఉన్నాయి. ‘లేచింది మహిళా లోకం’ కూడా అదే బాటలో సక్సెస్ అవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రీరామచంద్ర, హేమ , భద్రం ముఖ్య పాత్రల్లో నటించారు. బృహస్పతి ఎంటర్‌టైన్‌మెంట్స్, అపరెంట్లీ సినిమా, స్టోరీ ఫ్యాక్టరీ బ్యానర్లపై హైమా రాజశేఖర్, శ్వేత మహి , నిరోష నవీన్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు.

మంచు లక్ష్మి  మార్క్ కామెడీ

నేటి టెక్నాలజీ యుగంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, సోషల్ మీడియా ప్రభావం వంటి అంశాలను కూడా దర్శకులు ఇందులో చమత్కారంగా చూపించినట్లు తెలుస్తోంది. మంచు లక్ష్మి మార్క్ కామెడీ , అనన్య నాగళ్ళ సెటిల్డ్ యాక్టింగ్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచే అవకాశం ఉంది. ఒకవేళ మీరు థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యుంటే, ఈ బుధవారం నుండి మీ ఇంట్లోనే కూర్చుని ఈ ‘మహిళా లోకం’ విన్యాసాలను వీక్షించవచ్చు.. 

 

©️ VIL Media Pvt Ltd.