
అల్లు అర్జున్, అట్లీ నుంచి రాబోతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘రాకా’ (RAAKA). ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. బన్నీ నెవర్ బిఫోర్ లుక్లో కనిపించి అభిమానులలో అంచనాలు పెంచారు. సింపుల్గా చెప్పాలంటే.. అల్లు అర్జున్ గ్లోబల్ మార్కెట్‌పై కన్నేశారని తమ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘రాకా’మ్యూజిక్ డైరెక్టర్ కిక్కిచ్చే అప్డేట్ ఇచ్చారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ పాల్గొని ‘రాకా’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘రాకా టైటిల్ థీమ్ సౌండ్‌ట్రాక్ & సినిమా కోసం చేస్తున్న ప్రయోగాలపై వివరించాడు. మ్యూజిక్, సాంగ్స్, సౌండింగ్ ట్రాక్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుందని అన్నారు. ప్రస్తుతం సాయి మాట్లాడిన ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇంటర్నేషనల్ లెవల్‌లో ‘రాకా’ మ్యూజిక్:
దర్శకుడు అట్లీకి మ్యూజిక్ విషయంలో క్లియర్ విజన్ ఉందని, తాను రూపొందించిన థీమ్ ట్రాక్ ఆయనకు, హీరో అల్లు అర్జున్కు బాగా నచ్చిందని సాయి తెలిపారు. ముఖ్యంగా ఈ సినిమా మ్యూజిక్‌ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామని, ప్రతి ట్రాక్‌లో కొత్త ఫీల్ ఉండేలా చూస్తున్నామని చెప్పారు.
ఇంకా సాయి అభ్యంకర్ మాట్లాడుతూ..‘‘ రాకా కోసం ఎలాంటి సౌండ్ కావాలి, ట్రాక్ ఎలా ఉండాలి అన్నదానిపై అట్లీకి ఫుల్ క్లారిటీ ఉంది. ఇప్పటికే, ‘రాకా’ కోసం చేసిన ట్యూన్స్ అట్లీ & బన్నీకి వీపరీతంగా నచ్చాయి. ఈ ఆల్బమ్ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటుందనే నమ్మకం ఉంది. ఇందులో ఇంటర్నేషనల్ సింగర్స్, లిరిసిస్ట్‌లు కూడా భాగమయ్యారు. ముఖ్యంగా అల్లు అర్జున్కు సంగీతంపై ఉన్న ప్రేమ ఈ ప్రాజెక్ట్‌కు మరింత శక్తినిస్తుందని’’ సాయి అభ్యంకార్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో ‘రాకా’ సాంగ్స్పై అంచనాలు నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోయాయి.
#SaiAbhyankkar: #Raaka
Atlee knew the sound he wanted from Day 1. The songs have come out really well. #AlluArjun sir loves music. We want the album to go international with global singers and lyricists.#RAAKA #SunPictures #AA23 #AALoki #MythriMovieMakers #AA25 #Tseries pic.twitter.com/CJNdN8oazX— 𝒱𝒜 𝒸𝓊𝓁𝓉 ᵏʰᵃᵈʰᵃʳ ˢᵗʸˡⁱˢʰ (@khadharkhan1982) April 20, 2026
ఇకపోతే, ‘రాకా’ మూవీకి సంబంధించిన ఫస్ట్ థీమ్ ట్రాక్ “Make Way For The King”ను విడుదల చేశారు. ఈ ట్రాక్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. వెంటనే చార్ట్‌బస్టర్‌గా అనిపించుకోపోయినా, పవర్‌ఫుల్ సౌండ్‌తో ఆకట్టుకుంది. మొత్తానికి ఈ థీమ్ ట్రాక్ సినిమాకు బలమైన ప్రారంభాన్ని ఇచ్చిందనే టాక్ ఉంది.
రూ.800 కోట్ల బడ్జెట్!
సుమారు రూ.800 కోట్ల బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్. వీర యోధురాలిగా కనిపిస్తుంది. పుష్ప చిత్రాలతో పాన్ ఇండియా క్రేజ్‌ను సొంతం చేసుకున్న బన్నీ, రాకతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.