Reading Time: 2 minutes

Aneet Padda: ‘సయ్యారా’ హీరోయిన్ ఇంట్లో విషాదం.. అతనిపై నా ప్రేమ చావదంటూ భావోద్వేగ పోస్ట్

Caption of Image.

‘సయ్యారా’తో మోస్ట్ పాపులార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన యంగ్ బ్యూటీ.. అనీత్ పడ్డా (Aneet Padda). ఈ ట్రెండింగ్ హీరోయిన్ గురించి తెలియని యూత్ ఆడియన్స్ ఉండరు. ఇపుడు ఈ అనీత్ పడ్డా ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంగళవారం ఏప్రిల్ 21, 2026న అనీత్ పడ్డా తాతయ్య అల్జీమర్స్ వ్యాధితో పోరాడుతూ కన్నుమూశారు. ఈ విషయాన్ని నటి అనీత్ పడ్డా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.

నటి అనీత్ పడ్డా, తన తాతయ్య చేతిని పట్టుకున్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేసి, ఎమోషనల్ అయింది. తన జీవితంలో ఉన్న ఒకే ఒక్క ప్రేమ తాతయ్యే అని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే తాతయ్యతో ఉన్న అనుబంధాన్ని తలుచుకుంటూ రాసిన పదాలు హార్ట్ టచింగ్గా ఉన్నాయి. 

“నా జీవితంలో నేను పొందిన ఏకైక నిజమైన ప్రేమ మీరే. మీరు జ్ఞాపకాలను కోల్పోయినా.. మీ మనవరాలిని (మాఖన్) మాత్రం మర్చిపోలేదు” అంటూ అనీత్ పడ్డా ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన జ్ఞాపకాలను, ఆయన చెప్పిన జోకులను, ఆయనలోని దయా గుణాన్ని తన జీవితాంతం గుర్తు ఉంచుకుని ముందుకు వెళ్తానని అనీత్ పడ్డా వెల్లడించింది.

అలాగే, “ఈ రోజు ఆకాశంలో అతి ప్రకాశవంతమైన నక్షత్రాన్ని చూసి.. నువ్వు ఎక్కడికి వెళ్లావో నాకు తెలిసింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను దాదూ.. కాలం కూడా అడ్డుకోలేని ప్రేమతో ఎప్పటికీ” అంటూ తన భావాలను వ్యక్తం చేసింది. అయితే, ‘సయ్యారా’ సినిమాలో ఆల్జీమర్స్ బాధితురాలిగా అనీత్ పడ్డా నటించిన విషయం తెలిసిందే. ఇపుడు తన తాతయ్య కూడా అదే వ్యాధితో పోరాడుతూ చనిపోవడం షాకింగ్గా ఉంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aneet Padda (@aneetpadda_)

సయ్యారా’ ఎందుకు అనీత్‌కు ఎమోషనల్ మూవీ?

సయ్యారా సినిమాలో అనీత్ పోషించిన ‘వాణి బాత్రా’ పాత్రకు చిన్న వయసులోనే ఆల్జీమర్స్ నిర్ధారణ అవుతుంది. ఈ కథ తన తాత జీవితంతో ఎంతో దగ్గరగా ఉందని అనీత్ గతంలోనే తెలిపింది. “మెదడు మర్చిపోతుంది. కానీ హృదయం మాత్రం ఎప్పుడూ మర్చిపోదు” అనే సినిమా సందేశం తన తాతకు పూర్తిగా సరిపోతుందని ఆమె పేర్కొంది.

ఆమె చెప్పిన ప్రకారం, తాతకు తన పేరు కూడా గుర్తు ఉండేది కాదు. కానీ ‘హీరాపుట్’ లేదా ‘మఖన్’ అని మాత్రం పిలిచేవారని గుర్తుచేసుకుంది. ఒకసారి సయ్యారా వీడియోలు చూపించినప్పుడు గుర్తుపట్టరనుకున్నప్పటికీ, “మఖన్ ది మూవీ” అని చెప్పిన ఆ క్షణం తనకు ఎంతో ప్రత్యేకమని అనీత్ భావోద్వేగంగా వెల్లడించింది.

©️ VIL Media Pvt Ltd.