
సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్ఈసీఎల్) మైనింగ్ సర్దార్, డిప్యూటీ సర్వేయర్, అసిస్టెంట్ ఫోర్‌మ్యాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బి.టెక్/ బీఈ, డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 15న ప్రారంభమై మే 5న ముగియనున్నది.
పోస్ట్ పేరు: మైనింగ్ సర్దార్, డిప్యూటీ సర్వేయర్, అసిస్టెంట్ ఫోర్‌మ్యాన్.
మొత్తం ఖాళీలు: 1055.
విభాగాల వారీగా ఖాళీలు: మైనింగ్ సర్దార్ టీ & ఎస్ గ్రేడ్–సి 577, డిప్యూటీ సర్వేయర్ టీ & ఎస్ గ్రేడ్–-సి (మైనింగ్) 43, అసిస్టెంట్ ఫోర్‌మ్యాన్ (ఎలక్ట్రికల్) గ్రేడ్–సి 435.
ఎలిజిబిలిటీ
మైనింగ్ సర్దార్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మైనింగ్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా / డిగ్రీతోపాటు చెల్లుబాటు అయ్యే మైనింగ్ సర్దార్‌షిప్, గ్యాస్ టెస్టింగ్, ప్రథమ చికిత్స సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
డిప్యూటీ సర్వేయర్: మైనింగ్ / మైన్ సర్వేయింగ్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమాతోపాటు సర్వేయర్స్ సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ కలిగి ఉండాలి.
అసిస్టెంట్ ఫోర్‌మ్యాన్ (ఎలక్ట్రికల్): గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 15.
అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ లకు రూ.1000. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మాజీ సైనికులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: మే 14.
ఆన్‌లైన్ ఎగ్జామ్ (తాత్కాలికం): 2026, జూన్
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ secl-cil.inను సందర్శించండి.
ఆన్‌లైన్ పరీక్షా విధానం
ఈ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 100 మార్కులు కేటాయించారు. పార్ట్–ఏలో ప్రొఫెషనల్ నాలెడ్జ్ (సంబంధిత సబ్జెక్టు) 70 ప్రశ్నలు, పార్ట్–బీలో జనరల్ అవేర్ నెస్, మ్యాథ్స్, రీజనింగ్ నుంచి 30 ప్రశ్నలు ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ లేదు.