
గుజరాత్ లో వరస ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లి విందులో వందలాది మంది అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. గడిచిన వారంలో రోజుల్లో పెళ్లి విందులో భోజనం చేసి అస్వస్థతకు గురైన ఘటనలు మూడు జరిగాయి. ఈ ఘటనల్లో ఒకరిద్దరు కాదు.. ఏకంగా వందల్లో అస్వస్థతకు గురికావడం ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం (ఏప్రిల్ 21) గుజరాత్ లోని దాహోద్ జిల్లాలో పెళ్లి విందులో భోజనం చేసి 400మంది అతిథులు అస్వస్థతకు గురైన ఘటన వెలుగు చూసింది.
గుజరాత్‌లోని దాహోద్ జిల్లా అబ్లోద్ గ్రామంలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి విందులో భోజనం తిని 400 మందికి పైగా అతిథులు అస్వస్థతకు గురవ్వడంతో భయాందోళనలు, గందరగోళం నెలకొంది.ఇది అదిపెద్ద ఫుడ్ పాయిజనింగ్ కేసుగా అధికారులు అనుమానిస్తున్నారు. బాధితులను చికిత్సకోసం హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. ఫుడ్ పాయిజనింగ్ ఎందుకు అయ్యిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రాథమిక రిపోర్టుల ప్రకారం.. పెళ్లి విందులో భోజనం చేసిన కొన్ని గంటల తర్వాత అథితులకు వికారం, వాంతులు, కడుపునొప్పి, తల తిరగడం వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో బాధితులను ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై జిల్లా ఆరోగ్య అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనకు స్పందించిన ఆహార భద్రతా విభాగం విచారణ చేపట్టింది. పెండ్లి విందులో వడ్డించిన పిండి వంటలు, పప్పులు, శనగపిండి, నూడుల్స్ వంటి వివిధ ఆహార పదార్థాల శాంపిల్స్ ను టెస్టులకుల్యాబ్ కు పంపించారు.
ఇలాంటి ఘటనే గత గురువారం గుజరాత్ లోని తెహ్రీలో ఓ పెళ్లి వేడుకలో జరిగింది. తెహ్రీ జిల్లా బాద్షాహితాల్ ప్రాంతంలో కలుషిత ఆహారం తిన్న దాదాపు 40 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముఖ్యంగా పిల్లలు, మహిళలు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు.
రోగులందరి పరిస్థితి నిలకడగా ఉందని, వైద్య సిబ్బంది వారిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారని చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అమిత్ రాయ్ హామీ ఇచ్చారు. ప్రాథమిక చికిత్స అనంతరం పలువురు రోగులకు చికిత్స అందించి డిశ్చార్జ్ చేశారని, కాగా మరికొందరు ఇంకా పర్యవేక్షణలోనే ఉన్నారని ఆయన తెలిపారు.
ఈ ఘటనకు ప్రతిస్పందనగా, ఆహార భద్రతా విభాగం విచారణను ప్రారంభించింది. అనారోగ్యానికి కారణాన్ని నిర్ధారించడానికి అధికారులు పిండి, పప్పులు, శనగపిండి, నూడుల్స్ వంటి వివిధ ఆహార పదార్థాల నమూనాలను ప్రయోగశాల పరీక్షల కోసం సేకరించారు.