
దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు భయాందోళనకు గురి చేస్తున్నాయి. కొన్ని వారాలుగా భారీగా కోవిడ్ కేసులు నమోదు అవుతున్నాయి.సగానికి పైగా కుటుంబాలలో కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నారు. ఢిల్లీలోని సగానికి పైగా కుటుంబాలలో కనీసం ఒకరు కోవిడ్ బారిన పడ్డట్లు ఇటీవల లోకల్‌సర్కిల్స్ అనే సంస్థ జరిపిన సర్వేలో తేలింది. ఇది మరో ప్రమాదకర వేవ్‌కు సంకేతమా అన్న భయాందోళనలు రేకెత్తిస్తోంది.
లోకల్‌సర్కిల్స్ నిర్వహించిన సర్వే ప్రకారం..ఢిల్లీ ఎన్ సీఆర్ ప్రాంతంలో సర్వే చేసిన కుటుంబాలలో గత కొన్ని వారాలుగా దాదాపు 56 శాతం మంది కోవిడ్ తో బాధపడుతున్నారు. కుటుంబంలో కనీసం ఒకరు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి ,అలసట వంటి లక్షణాలు ఉన్నట్లు తేలింది. 11శాతం కుటుంబాల్లో నలుగురి కంటే ఎక్కువమంది సభ్యులు అనారోగ్యంతో ఉన్నారని , ఇది వ్యాధి వ్యాప్తి తీవ్రతను సూచిస్తుందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
►ALSO READ | సమ్మర్లో వచ్చే తలనొప్పి మైగ్రేన్ కావొచ్చా ? ఈ లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకండి..
ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్ ప్రాంతాల్లో16వేల కుటుంబాల్లో సర్వే చేయగా..56శాతం కుటుంబాలలో కనీసం ఒక సభ్యుడికి కోవిడ్ ఉన్నట్లు తేలింది. జ్వరం, దగ్గు ,అలసట వంటి కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నారు. సుమారు 11శాతం కుటుంబాల్లో తీవ్రత ఎక్కువగా ఉందని, ప్రతి ఇంట్లో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు అనారోగ్యంతో ఉన్నట్లు వెల్లడైంది.
కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుదల వెనక కారణం..
ఎండాకాలం ప్రారంభ సమయంలో మారుతున్న ఉష్ణోగ్రతల కారణంగా రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో పాటు ఢిల్లీలో వాయికాలుష్యం స్థాయి విపరీతంగా పెరిగిపోవడంతో శ్వాస కోశ వ్యాధులు, వైర్ ఇన్ ఫెక్షన్లకు దారి తీస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. కేసుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ఉన్నప్పటికీ ఇది తీవ్రమైన వేరియంట్ కాదని వాటిలో చాలా వరకు తేలికపాటివే. చాలా కేసుల్లో జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, అలసట వంటి లక్షణాలు ఉండగా, పిల్లలలో కొన్నిసార్లు జలుబు, తేలికపాటి జ్వరం లేదా ఆకలి మందగించడం వంటి సీజనల్ వైరల్ ఇన్ఫెక్షన్లను కనిపిస్తున్నాయని హైదరాబాద్‌లోని గ్లెనెగల్స్ అవేర్ హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ వంశీ చెబుతున్నారు.