
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19 సీజన్ లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న హైవోల్టేజ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. దీంతో ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక గత మ్యాచులో గాయపడిన రోహిత్ శర్మ ప్రస్తుతం ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇక పంజాబ్ పై ఒత్తిడి పెట్టేలా భారీ స్కోర్ చేయాలని పట్టుదలతో ముంబై బరిలోకి దిగబోతుంది.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ: “మేము బౌలింగ్ ఎంచుకుంటున్నాం.. మా జట్టు కాంబినేషన్ చాలా బాగుంది, దానినే కొనసాగించాలనుకుంటున్నాం.. పిచ్ కొంచెం పొడిగా (Dry) కనిపిస్తోంది. మేము ఎలాంటి మార్పులు లేకుండా సేమ్ టీమ్‌తో బరిలోకి దిగుతున్నామని పేర్కొన్నాడు.
►ALSO READ | ‘దోశ– ఇడ్లీ’ సాంగ్ వివాదం.. బీసీసీఐకి చెన్నై సూపర్ కింగ్స్ ఫిర్యాదు
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ: మేము కూడా మొదట బౌలింగ్ చేయాలనుకున్నాం.. గత మ్యాచ్‌లో చివరి 4 ఓవర్లలో 20 కంటే ఎక్కువ పరుగులు ఇచ్చాం, ఈసారి ఆ తప్పులు జరగకుండా చూసుకుంటాం. రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు, అతను కోలుకోవడానికి మరో రెండు మ్యాచ్‌లు పట్టవచ్చు అని పేర్కొన్నాడు. అలాగే మిచెల్ శాంట్నర్ స్థానంలో ఆకాశ్ మద్వాల్ తుది జట్టులోకి వచ్చాడని పేర్కొన్నాడు.
🚨Toss update from Mumbai 🚨@PunjabKingsIPL won the toss and elected to bowl first against @mipaltan
Updates ▶️ https://t.co/Fn2dxJ4zYR#TATAIPL | #KhelBindaas | #MIvPBKS pic.twitter.com/8JUs4Tk9hj
— IndianPremierLeague (@IPL) April 16, 2026
ముంబై ఇండియన్స్:
ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ మధ్వాల్.
పంజాబ్ కింగ్స్:
ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), కూపర్ కానలీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, వైశాఖ్ విజయ్‌కుమార్, అర్ష్‌దీప్ సింగ్.