Reading Time: < 1 minute

స్టూడెంట్ పై లైంగిక వేధింపులు… చెన్నై అన్నా యూనివర్సిటీ ప్రొఫెసర్ అరెస్ట్..

Caption of Image.

స్టూడెంట్ పై లైంగిక వేధింపుల ఆరోపణల క్రమంలో చెన్నై అన్నా యూనివర్సిటీ ప్రొఫెసర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. యూనివర్సిటీలో డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థినితో లోదుస్తులు, ఋతుక్రమం వంటి అంశాలపై అసభ్యకరంగా మాట్లాడుతూ ఇబ్బంది పెడుతున్నదంటూ ఫిర్యాదు చేయడంతో ప్రొఫెసర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. 

చెన్నైలోని అన్నా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జ్ఞానవేల్ బాబు తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది ఓ విద్యార్థిని. తనను తరచూ కలవాలని ఒత్తిడి చేసేవాడని… లోదుస్తులు, ఋతుక్రమం, పెళ్లి వంటి అంశాలు ప్రస్తావిస్తూ అసభ్యకరంగా మాట్లాడేవాడిని ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు.

అంతే కాకుండా.. ప్రొఫెసర్ తనకు తరచూ ఫోన్ కాల్స్ చేసేవాడని.. తనకు శారీరకంగా సహకరిస్తే డబ్బులు ఇస్తానంటూ అఫర్ చేసేవాడని.. ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడేవాడిని తెలిపింది బాధితురాలు. తన కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్న ప్రొఫెసర్.. సెకండ్ ఇయర్ చదివే సమయంలో తనకు ఇంటర్న్ షిప్ ఇప్పిస్తానని చెప్పి లైంగికంగా వేధించడం స్టార్ట్ చేశాడని తెలిపింది బాధితురాలు.

►ALSO READ | తమిళనాడు ఎన్నికలు: డీఎంకే తొలి జాబితా విడుదల.. కొలత్తూరు నుంచే స్టాలిన్

థర్డ్ ఇయర్ కి వచ్చేసరికి ప్రొఫెస్సర్ వేధింపులు మరింత తీవ్రం చేశాడని.. తరచూ తనను కలవాలంటూ ఒత్తిడి చేసేవాడని తెలిపింది బాధితురాలు.రాత్రి 10 గంటల తర్వాత కూడా ప్రొఫెసర్ తనకు ఫోన్ చేసేవాడని, అతడిని బ్లాక్ చేసిన తర్వాత కూడా స్నేహితుల ద్వారా సంప్రదించడం, తనను ఏలడా అలా కలిసేందుకు ప్రయత్నించడం చేసేవాడని తెలిపింది. ఈ క్రమంలో లైంగిక వేధింపుల నివారణ కమిటీకి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపింది బాధితురాలు.

సదరు ప్రొఫెసర్ పై గతంలో కూడా లైంగిక ఆరోపణలు ఉన్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో నిరసనకు దిగారు విద్యార్థులు. ప్రొఫెసర్ పై ఎఫైఆర్ కూడా నమోదైన క్రమంలో ప్రొఫెసర్ ను సస్పెండ్ చేసింది యూనివర్సిటీ. ఈ ఘటనపై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.

©️ VIL Media Pvt Ltd.