
మెట్రో ప్రయాణికులకు కేంద్రం షాకిచ్చింది. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు వేసేలా శుక్రవారం లోక్‌సభలో కొత్త బిల్లు ప్రవేశపెట్టింది. మద్యం తాగి రైలెక్కడం, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం, ఉమ్మి వేయడం వంటి వాటికి ఇప్పటివరకు విధిస్తున్న రూ. 500 జరిమానాను రూ. 2,500కు పెంచింది. అలాగే రైల్లో అసభ్య రాతలు రాయడం, పోస్టర్లు అతికిస్తే విధించే ఫైన్ వెయ్యి రూపాయల నుంచి రూ. 10 వేలకు పెంచింది. మహిళా కోచ్‌లలోకి ప్రవేశించే పురుషులకు ఫైన్‌ను రూ. 250 నుంచి ఏకంగా రూ. 5 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జన విశ్వాస (సవరణ) బిల్లు 2026ను వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ లోక్‌సభలో ప్రవేశ పెట్టారు.