
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో భాగంగా.. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుగున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కష్టాల్లోపడింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన సన్‌రైజర్స్‌కు మూడో ఓవర్‌లోనే షాక్ తగిలింది. డఫీ వేసిన ఈ ఓవర్ తొలి బంతికి అభిషేక్ శర్మ (7) జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అదే ఓవర్ చివరి బంతికి ట్రావిస్ హెడ్(11) ఔట్ అయ్యాడు. మళ్లీ డఫీ ఓవర్‌లోనే నితీశ్ రెడ్డి (1) పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఆరు ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ మూడు వికెట్లు నష్టానికి 49 పరుగులు చేసింది. క్రీజ్‌లో ఇషాన్ కిషన్(23), క్లాసెన్(3) ఉన్నారు.