
వరుణ్ తేజ్ హీరోగా.. నిహారికా నిర్మిస్తున్న చిత్రం ‘బరి’. ఈ చిత్రం ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ఈ సినిమా షూటింగ్‌ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ‘ది వరల్డ్ ఆఫ్ బరి’ పేరుతో ఓ ప్రత్యేకమైన వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ వీడియో బట్టి చూస్తే.. ఈ సినిమా గ్రామీణ వాతావరణంలో తెరకెక్కుతుందని అర్థమవుతోంది. వాలీబాల్ క్రీడాకారుడిగా వరుణ్ తేజ్ ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకి యదు వంశీ దర్శకత్వం వహిస్తుండగా.. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. 2027 సంక్రాంతి కానుకగా ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది.