
ఉత్తర్ ప్రదేశ్: నొయిడా సెమీకండక్టర్ ఫ్యాక్టరీ శిలన్యాస్ చేశాం అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. నోయిడా ఎయిర్ పోర్టును, మీరట్ మెట్రో విస్తరణ ప్రారంభించాం అని అన్నారు. ఈ సందర్భంగా నొయిడా లో మోడీ ప్రసంగించారు. 2003 లో దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి హయాంలోనే ఈ ఎయిర్ పోర్టు మంజూరైందని, కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు అని విమర్శించారు. ఈ విమానాశ్రయం మల్టీమోడల్ కనెక్టివిటి కలిగి ఉంది అని తెలియజేశారు. ఈ కష్టకాలంలో దేశమంతా ఒక్కటై పోరాడాలి అని.. ఈ కష్టకాలంలో దేశం అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించాలి అని సూచించారు. ప్రతి రెండు నిముషాలకు ఓ విమానం ఇక్కడి నుంచి ఎగురుతుంది అని.. సంవత్సరాల నుంచి ఈ ఎయిర్ పోర్టు అభివృద్ధి చెందకుండా విపక్షం అడ్డుకుంది అని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టులన్నీ ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి దోహదం చేస్తాయి అని.. నొయిడా ఎయిర్ పోర్టు వల్ల యూపీ రైతులకు చాలా లబ్ధి చేకూరుతుంది అని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఓ ఉదాహరణ అని మోడీ పేర్కొన్నారు.
ఈ ఎయిర్ పోర్టు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంలో భాగం అని.. పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచదేశాలు ఇబ్బందులు పడుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ స్థానంలో ఇథనాల్ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాం అని.. ఇథనాల్ వాడకం పెరిగితే, రైతులకు ఆదాయం పెరుగుతుంది అని అన్నారు. దేశంలో చిన్నచిన్న నగరాలకు విమాన సర్వీసులు విస్తరిస్తున్నాయి అని.. సామాన్య భారతీయుడు విమాన ప్రయాణం చేసేలా చర్యలు తీసుకుంటున్నాం అని అన్నారు. 85 శాతం విమానాల తయారీ, ఓవర్ హాలింగ్ విదేశాల్లోనే జరుగుతోంది అని.. ఆ పరిస్థితి మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం అని చెప్పారు. రూ. 29,560 కోట్లతో నొయిడా ప్రోజెక్టు నిర్వహణ అని.. యమున ఇంటర్నెల్ ఎయిర్ పోర్టును అభివృద్ధి చేస్తున్నాం అని అన్నారు. వికసిత్ భారత్ కోసం అందరూ కలిసి శ్రమించాలి అని.. పశ్చిమాసియా యుద్ధాన్ని నిశింతగా పరిశీలిస్తున్నాం అని మోడీ స్పష్టం చేశారు.