
హైదరాబాద్: బలహీన వర్గాలకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బిసిల గురించి మాట్లాడుతుంటే బిఆర్ఎస్ వాకౌట్ చేసిందని, బిసి రిజర్వేషన్ల పెంపు సమయంలో కూడా వాకౌట్ చేశారని సభలో బిసిల అంశం వచ్చినప్పుడల్లా బిఆర్ఎస్ బయటకు వెళ్తుంది అని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బిసి రిజర్వేషన్ల పెంపు అంశంపై పొన్నం మాట్లాడారు. నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి పథకాలకు అండగా నిలుస్తున్నామని తెలియజేశారు. బిసిల అభివృద్ధి కోసం విపక్ష నేతలు మంచి సలహాలు ఇవ్వాలని పొన్నం సూచించారు. విద్యార్థుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, గురుకులాల్లో మౌలిక వసతులు పెంచుతున్నామని అన్నారు. పోలీసుల భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, డ్రగ్స్ కట్టడి చేస్తున్నాం అని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.