Reading Time: < 1 minute

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన చిత్రం ‘జననాయగన్’. నిజానికి ఈ సినిమా ఈ జనవరిలోనే విడుదల కావాల్సింది. కానీ, కొన్ని కారణాల వల్ల సినిమా విడదుల వాయిదా పడుతూ వస్తుంది. తాజ నివేదికల ప్రకారం ఈ సినిమా విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. విజయ్ పుట్టినరోజున ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. జూన్ 22న హీరో పుట్టినరోజు కావడంతో ఈ సినిమాను జూన్ 18వ తేదీన విడుదల చేస్తారని అంతా భావించారు. అయితే ఈ తేదీకి కూడా సినిమా రావడం కష్టమే అని తెలుస్తోంది. ఈ సినిమాను నిర్మించిన కెవిఎన్ ప్రొడక్షన్స్ చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ కూడా ఒకటి. ఈ చిత్రం జూన్‌లో విడుదల కానుంది. దీంతో జులైలో ‘జననాయగన్’ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.