Reading Time: < 1 minute

IPL 2026: చెన్నై అభిమానులకు పిడుగు లాంటి వార్త: ఐపీఎల్‎కు 2 వారాలు ధోనీ దూరం

Caption of Image.

చెన్నై: మరికొన్ని గంటల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ గ్రాండ్‎గా ప్రారంభం కానుంది. ఈ తరుణంలో ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక టైటిల్స్ నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్‎కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. చెన్నై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ తొలి రెండు వారాలకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని చెన్నై మేనేజ్మెంట్ వెల్లడించింది. 

కండరాల నొప్పి కారణంగా ఐపీఎల్ తొలి రెండు వారాలకు ధోనీ దూరమైనట్లు తెలిపింది. ప్రస్తుతం ధోనీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని.. కోలుకోగానే గ్రౌండ్‏లో అడుగు పెడతాడని పేర్కొంది. దీంతో ధోనీ తొలి నాలుగు మ్యాచులకు దూరమయ్యే అవకాశం ఉంది. ధోనీ స్థానంలో  సంజు శాంసన్ లేదా ఉర్విల్ పటేల్ కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. తలా ఆట కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న అతడి అభిమానులకు ఇది పిడుగు లాంటి వార్తే. 

అంతర్జాతీయ క్రికెట్‎కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 2026 ఐపీఎల్ సీజన్ కోసం కెప్టెన్ కూల్ కసరత్తు మొదలుపెట్టాడు. కానీ ప్రాక్టీస్ సమయంలో కూడా తలా కాస్తా అసౌకర్యంగానే కనిపించాడు. ధోనీ పిక్క కండరాల నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం.

 సీజన్ ప్రారంభం నాటికి గాయం నయం అవుతుందనుకున్నప్పటికీ తీవ్రత ఎక్కువగా ఉండటంతో తగ్గలేదు. దీంతో ఐపీఎల్ తొలి రెండు వారాలకు దూరమయ్యాడు. మార్చి 28న ఈ విషయాన్ని చెన్నై మేనేజ్మేమెంట్ అఫిషియల్‎గా ప్రకటించింది. ధోనీ ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. కాగా, చెన్నై ఈ సీజన్‎ను మార్చి 30న రాజస్థాన్ రాయల్స్‎తో మొదలుపెట్టనుంది. 

 

©️ VIL Media Pvt Ltd.