Reading Time: < 1 minute

ఇంధన సంక్షోభం రాకుండా కేంద్రం చర్యలు : బీజేపీ ఎల్పీ నేత ఏలేటీ మహేశ్వర్ రెడ్డి

Caption of Image.
  •     బీజేపీ ఎల్పీ నేత ఏలేటీ మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్నప్పటికీ, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా కేంద్రం ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన శుక్రవారం ఒక ప్రకటన రిలీజ్ చేశారు. యుద్ధం నేపథ్యంలో ఇంధన ధరలు పెరుగుతాయేమోనని ఆందోళన చెందిన సామాన్యులకు ప్రధాని నిర్ణయం ఊరటనిచ్చిందని తెలిపారు. 

ప్రపంచ సంక్షోభం వేళ చమురు కంపెనీలకు దిగుమతి వ్యయం పెరిగినా, ప్రజలపై భారం పడకుండా కేంద్రం పన్నులు తగ్గించిందని వివరించారు. పెట్రోల్ పై ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని లీటర్​కు రూ.13 నుంచి ఏకంగా రూ.3కి తగ్గించారని, అలాగే డీజిల్ పై ఉన్న రూ.10 సుంకాన్ని పూర్తిగా తొలగించారని తెలిపారు. సామాన్యుల ప్రయోజనాలే ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం మరోసారి రుజువు చేసిందని కొనియాడారు. 

©️ VIL Media Pvt Ltd.