Reading Time: < 1 minute

లిమ్కాబుక్ హోల్డర్ అశోక్ కన్నుమూత

Caption of Image.

తాండూర్,​ వెలుగు: వికారాబాద్​జిల్లా తాండూరుకు చెందిన జానపద నృత్య కళాకారుడు అశోక్​ సోమవారం గుండెపోటుతో కన్నుమూశారు. అశోక్​చిన్నతనం నుంచే జానపద నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. తన ప్రదర్శనలతో లిమ్కా బుక్ ఆఫ్​రికార్డ్సులోనూ స్థానం సంపాదించుకున్నారు. తాండూర్​లో ఫైన్​ఆర్ట్​కల్చర్​అకాడమీ ప్థాపించి ఎందరో కళాకారులను తయారు చేశారు. జానపద వేషధారణలో ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో  తొమ్మిది అవార్డులు అందుకున్నారు. సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు. 

©️ VIL Media Pvt Ltd.