
ప్రస్తుతం దేశంలో ‘ధురంధర్ 2’ మేనియా గట్టిగానే నడుస్తోంది. ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్లుతోంది. మొదటి పార్ట్ కు మించి వసూళ్లు రాబడుతూ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. మార్చి 19న రిలీజైన ధురంధర్ ది రివేంజ్ కేవలం 3 రోజుల్లోనే రూ. 500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. దీంతో డైరెక్టర్ ఆదిత్య ధర్ పేరు మరోసారి మార్మోగుతోంది. ఉరి తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్ ఇప్పుడు ధురందర్, ధురంధర్ రివేంజ్ లతో స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు. ఇప్పుడు ఇతని దర్శకత్వంలో నటించేందుకు స్టార్ హీరోలు తీసేందుకు సైతం క్యూలో ఉన్నారు. కాగా ధురంధర్ ఫ్రాంఛైజీలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. ఇందులో మూడో భాగం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ధురంధర్ ది రివేంజ్ లోనూ మూడో పార్ట్ పై ఎలాంటి హింట్ ఇవ్వలేదు. దీంతో ‘ధురంధర్’ దర్శకుడు ఆదిత్య ధర్.. తర్వాత ఏ సినిమా చేస్తాడు? ఎవరితో చేస్తాడనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.
కాగా కొన్నాళ్ల క్రితం ‘అశ్వద్ధామ’ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ఓ ప్రకటన చేశాడు ఆదిత్య ధర్. ఇందుకోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఆదిత్య చర్చలు జరిపాడని ప్రచారం జరిగింది. అయితే దీని తర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే ధురంధర్ 2 సినిమా ప్రీమియర్ చూసిన అల్లు అర్జున్ సినిమాని కొనియాడుతూ ట్వీట్ చేయడం, ఆదిత్య ధర్ ను ఆకాశానికెత్తేయడం చూస్తుంటే త్వరలో వీరిద్దరూ కలిసి పనిచేస్తారేమోనని సినిమా ఇండస్డ్రీలో బలమైన టాక్ వినిపిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టులో బన్నీతో పాటు ఎన్టీఆర్ కూడా ఓ స్పెషల్ రోల్ చేస్తాడని రూమర్లు వస్తున్నాయి. ఒక వేళ ఇదే నిజమైతే బన్నీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగేనని చెప్పుకోవచ్చు. అలాగే మరో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
కాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆదిత్య ధర్ కాంబినేషన్ లోనూ ఓ క్రేజీ ప్రాజెక్టు రూపొందనుందని మరో రూమర్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే ప్రస్తుతానికి ఇవి కేవలం రూమర్లు మాత్రమే. వీటిలో నిజమెంతుందో తెలియడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చు.
ధురంధర్ 2 సినిమాపై అల్లు అర్జున్ రివ్యూ..
Just Watched #Dhurandhar2⁰Patriotism with swag
A film that will make every patriot proud⁰Many clap-trapping moments
BLAST!
Congratulations to the entire team.⁰Fine performances by @ActorMadhavan garu & all actors . Technical brilliance .So proud to have a…
— Allu Arjun (@alluarjun) March 18, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


