Reading Time: < 1 minute

ప్రోటీన్ వీక్ సెలబ్రేషన్స్.. ప్రొటీన్ ఫుడ్పై అమెజాన్ భారీ ఆఫర్స్

Caption of Image.

హైదరాబాద్​, వెలుగు:  ప్రపంచ ప్రోటీన్ దినోత్సవం సందర్భంగా ఈ–కామర్స్‌​ కంపెనీ అమెజాన్ ఇండియా మార్చి 28 వరకు ప్రోటీన్ వీక్ నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో భాగంగా వే ప్రోటీన్, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్, సప్లిమెంట్స్, ప్రోటీన్ బార్లపై 45 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది.

 మజిల్ బ్లేజ్, ఆప్టిమమ్ న్యూట్రిషన్, ఐసోప్యూర్, అవతార్ వంటి ప్రముఖ బ్రాండ్ల ప్రొడక్టులు అందుబాటులో ఉన్నాయి. కస్టమర్ల ఫిట్‌నెస్ లక్ష్యాలకు అనుగుణంగా విభిన్న ఉత్పత్తులను అందిస్తున్నామని అమెజాన్​ తెలిపింది. 

ధరల తగ్గింపు, డీల్స్ ద్వారా నాణ్యమైన పోషకాహారాన్ని తక్కువ ధరకే పొందవచ్చని ప్రకటించింది.  దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఒకే రోజు లేదా మరుసటి రోజు డెలివరీ ఇస్తున్నామని పేర్కొంది.

©️ VIL Media Pvt Ltd.